నారా లోకేశ్ కు రజనీకాంత్ ఫోన్ - అవన్నీ ఏం చేయలేవు..!!
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నారా లోకేశ్ కు ఫోన్ చేసారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి జైల్ లో రిమాండ్ లో ఉన్నారు. లోకేశ్ సైతం రాజమండ్రిలోనే మకాం వేసారు. చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయ పరమైన అంశాలతో పాటుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు లోకేశ్ కు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్ట్ పైన స్పందిస్తున్నారు.
లోకేష్ కి ఫోన్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

గతంలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా జరిగిన సభలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారి తీసాయి. రజనీకాంత్ వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో, రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీని ఎక్కడా విమర్శించలేదని చెప్పుకొచ్చారు. అయితే, జైలర్ మూవీ ఈవెంట్ లో రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో రజనీ కాంత్ చివర్లో తెలుగులో అర్దం అయిందా రాజా అంటూ డైలాగ్ చెప్పటంతో సోషల్ మీడియాలో చర్చ కు దారి తీసింది.
ఇక, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పైనా రజనీకాంత్ స్పందించారు. ఇప్పటికే చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించిన పవన్ కల్యాణ్ రేప (గురువారం) రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. నందమూరి బాలయ్య రాజమండ్రి చేరుకుంటున్నారు. అటు చంద్రబాబు కేసు పైన ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం చంద్రబాబు న్యాయవాది సిద్దార్ధ లూద్రా జైలులో చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇక, ఈ నెల 19 తరువాతనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications