Sree Leela: మీరు "కమిట్" అయ్యారా - ఎస్, శ్రీలీల షాకింగ్ ఆన్సర్...!!
శ్రీలీల ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంటే అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో పాటు చలాకీ తనంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. సినిమాలతో పాటు ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో ఇచ్చిన సమాధానాలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.మాస్ రాజా రవితేజతో జతకట్టింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ. అందులో ఒకరు మీరు బిగ్ బాస్ షో కు వస్తున్నారా అని ప్రశ్నించాడు. దానికి అవును ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేను వస్తున్నాను అని సమాధానం ఇచ్చింది.

అలాగే ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది శ్రీలీల. మీరు ఎవరికైనా కమిట్ అయ్యారా అని ప్రశ్నించాడు. దీంతో వెంటనే శ్రీలీల అవును అంటూ సమాధానం చెప్పింది. దీనికి కొనసాగింపుగా.. తన పనితో తాను కమిట్ అయ్యానని నెటిజెన్ కు దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రీలీల వైష్ణవ్ తేజ్ తో కలిసి ఆదికేశవ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి.తన తొలి లిప్ లాక్ ఎవరితో చెబుతూ కొద్ది రోజుల క్రితం సంచనలంగా మారిన శ్రీలీల..ఇప్పుడు కమిట్ అవ్వటం గురించి చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది. సినిమాలు చేస్తూనే శ్రీలీల మెడిసిన్ చేస్తోంది. తన వరకూ సినిమాలు, మెడిసిన్ వేరు వేరు. ఈ రెండు అంటే తనకు చాలా ఇష్టమంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications