అపాయింట్ డేపై స్టేకి కోర్టు నో: ఎపి హైకోర్టు పేరు మార్పు

హైదరాబాద్: అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ సాగింది. రాష్ట్ర విభజన సరిగా లేదని, అందువల్ల అపాయింటెడ్ డేపై స్టే ఇవ్వాలని న్యాయవాది సంజీవ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అపాయింటెడ్ డేపై స్టేకు హైకోర్టు నిరాకరించింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోందని, అందువల్ల స్టే ఇవ్వలేమని తెలిపింది. పిటిషన్ పైన విచారణను ఐదు వారాల పాటు వాయిదా వేసింది.

High Court rejects to stay on appointed day

హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్

'హైకోర్టు ఆఫ్ హైదరాబాద్'గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఇక నుంచి హైదరాబాద్ హైకోర్టు వ్యవహరించనుంది.

అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి హైకోర్టులో ప్రవేశానికి గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు తప్పనిసరి. హైకోర్టు న్యాయవాదులు మినహా ఇతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+