Kuppam: కుప్పంలో హై టెన్షన్-వైసీపీ, టీడీపీలకు అగ్నిపరీక్ష..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళ కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఇందులో సత్తా చాటుకునేందుకు వైసీపీ, టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు క్యాంపు రాజకీయాలు, మరోవైపు అధికార పార్టీ ప్రలోభాలు, ఇంకోవైపు హైకోర్టు ఆదేశాలు.. వీటి మధ్య ఇవాళ కుప్పంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కోసం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓ అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్సీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు ఇలా దాదాపు 100 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో వైసీపీ, టీడీపీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. వైసీపీ ఇప్పటికే తామ కార్పోరేటర్లను బెంగళూరు తరలించింది. వీరు ఇవాళ ఎన్నికకు హాజరయ్యేందుకు బయలుదేరారు. వీరికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

high tension in kuppm municipal chairman election amid tdp ysrcp number game

గతేడాది వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్.. తన పదవికి, కౌన్సిలర్ పదవికీ రాజీనామా చేశారు. అప్పటినుంచి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఖాళీగానే ఉంది. కుప్పం మున్సిపాలిటీలో ప్రస్తుతం 25 వార్డులుండగా మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ రాజీనామాతో 24 మంది కౌన్సిలర్లే ఉన్నారు. ఇందులో టీడీపీ తరఫున గెలిచిన ఆరుగురు, తర్వాత పార్టీలో చేరిన నలుగురితో కలిపి 10 మంది కౌన్సిలర్ల బలం ఉంది. వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భరత్‌, స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబుకు ఎక్స్‌ అఫిషియో ఓటు హక్కు ఉంది. ఈ లెక్కన చూస్తే 27 మంది సభ్యులవుతారు.

14 మంది సభ్యుల బలం ఎవరికి ఉంటే వారు మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో ఇవాళ జరిగే పోరులో వైసీపీ కౌన్సిలర్లంతా ఆ పార్టీకే ఓటు వేస్తే ఫ్యాన్ పార్టీ గెలుపు ఖాయం. అలా కాకుండా టీడీపీ వైపు ఫిరాయిస్తే మాత్రం అధికార కూటమి గెలుపు ఖాయమవుతోంది. దీంతో కౌన్సిలర్ల నిర్ణయంపై టెన్షన్ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+