ఆర్టీసీ కాంట్రాక్ట్, ఔట్ సౌర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు- తెలంగాణ సర్వీసుల పెంపు ప్రతిపాదన

ఏపీలో కరోనాతో పాటు చమురు ధరల పెరుగుదలతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ.. వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే పోరుగు రాష్ట్రమైన తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసులు పెంచుదామని ప్రతిపాదిస్తోంది.

ఆర్టీసీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీచేసింది. నైపుణ్యం లేని కార్మికులకు రూ.294, కొంత నైపుణ్యం ఉన్నవారికి రూ.349, నైపుణ్య కార్మికులకు రూ.428, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.322, అటెండర్లకు రూ.294, భద్రతా సిబ్బందికి రూ.304 చొప్పున జీతాలు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ పెంపు అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు గతంలో పెంచిన జీతాలే ఇవ్వడంలేదని, వాటిని గుత్తేదారులు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి పెంపు అయినా వారికి అందుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

hike in apsrtc contract, outsourcing employee wages, interstate services increase proposal to tsrtc

మరోవైపు కోవిడ్ కారణంగా తెలంగాణతో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో గతంలోలా పూర్తి స్థాయిలో బస్సులన్నీ నడుపుతుండటం, ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులను మరిన్ని పెంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది చేసుకున్న ఒప్పందంకంటే రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని కిలోమీటర్ల మేర బస్సులు నడుపుదామంటూ తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తాజాగా లేఖ రాశారు. ఇప్పటివరకు కరోనా రెండు దశల కారణంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పరిమితంగా సర్వీసులు నడుపుతుండగా.. రెండు మూడు నెలలుగా పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరుగుతోంది. దీంతో లాభదాయకంగా ఉండే తెలంగాణకు అంతర్‌రాష్ట్ర సర్వీసులు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా రెండు ఆర్టీసీలు నిత్యం 2.05 లక్షల కి.మీ.చొప్పున నడిపేందుకు అంగీకరించాలని కోరుతూ ఏపీఎస్‌ఆర్టీసీ లేఖ రాసింది. దీనిపై టీఎస్ఆర్టీసీ స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+