ఏపీ చరిత్రలో తొలిసారి.. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ICC వరల్డ్ కప్ మ్యాచ్ లు.. షెడ్యూల్ రిలీజ్

విశాఖ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. విశాఖలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవల ఇదే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా జరిగాయి. గతేడాది కూడా రెండు ఐపీఎల్ మ్యాచ్ లు విశాఖ స్టేడియంలో జరగడం విశేషం.

వైజాగ్ క్రికెట్ లవర్స్ కు కిక్ ఇచ్చే న్యూస్. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ఏపీలో ICC వుమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Historic First Vizag Hosts ICC Women s World Cup Matches in Andhra Pradesh

"వైజాగ్ లోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు ఏపీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జర్నీలో ఇదో నూతన అధ్యాయం. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా చెప్పొచ్చు. ఈ పరిణామం కేవలం క్రికెట్ మ్యాచ్ లకే కాదు. దేశంలోని బాలికలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. డ్రీమ్ బిగ్ అని ప్రోత్సహిస్తుంది. బౌండరీలు చెరిపి సత్తా చాటాలని నేర్పిస్తుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియాన్ని నింపేసి.. వుమెన్ వరల్డ్ కప్ కు ఘన స్వాగతం పలుకుదాం" అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇక ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ విషయానికి వస్తే.. అక్టోబరు 9,2025 నుంచి అక్టోబరు 16,2025 వరకు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబరు 9 న భారత్, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. అక్టోబరు 10న న్యూజీలాండ్, బంగ్లాదేశ్.. అక్టోబరు 12న భారత్, ఆస్ట్రేలియా.. అక్టోబరు 13న సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్.. అక్టోబరు 16న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ విషయం తెలిసి వైజాగ్ తో పాటు ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+