ఏపీ వైపు వాయుగుండం- కలెక్టర్లకు హోం శాఖ ఆదేశాలు

Bay of Bengal: బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత విస్తరిస్తోన్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. దీనికి అనుకూల వాతావరణ పరిస్థితులు మరింత దోహదపడ్డాయి.

ఇప్పటికే కేరళ, తమిళనాడు దక్షిణ ప్రాంతం, కర్ణాటక కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోకి రుతు పవనాలు ప్రవేశించాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం నాడే రాయలసీమ ప్రాంతంలోకీ నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టాయి. మిగతా ప్రాంతాలకూ క్రమంగా విస్తరిస్తోన్నాయి.

Home Minister Vangalapudi Anitha given directions to authorities in view of Heavy rains in AP

అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా తీరం వెంబడి వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది.

దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తోన్నాయి.

వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం అయ్యారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. నదీ తీరాలు, సరస్సులు, చెరువులను తక్షణమే గురించి వాటి వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+