హీరో, బజాజ్ కు పోటీగా హోండా కొత్త బైక్
భారతదేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండటం, తక్కువ మైలేజ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ద్విచక్ర వాహనాల మార్కెట్ లో హీరో స్ప్లెండర్ అత్యధికంగా విక్రమయ్యే వాహనంగా నిలిచింది.
హోండా షైన్, బజాజ్ పల్సర్ మధ్య ద్వితీయస్థానం కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. హీరో, బజాజ్ కంపెనీలకు పోటీనివ్వడానికి హోండా త్వరలోనే కొత్త బైక్ ను విడుదల చేయబోతోంది. హోండా SP160 పేరుతో 160 సీసీ బైక్‌ను తీసుకువస్తోంది. దసరా సందర్భంగా దీనిని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆధునికంగా, ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దారు.

ఇంజిన్ & పవర్ కొత్త 160సీసీ బైక్ తీసుకువస్తున్నట్లు హోండా కంపెనీ గతంలోనే ప్రకటించింది. దీనికి SP160 అనే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. SP125లా ఉంటుంది. ఎయిర్-కూల్డ్, 162.7cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా ఇది శక్తిని పొందుతుంది. 12.9hp, 14Nm ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. యునికార్న్ కన్నా కొంచెం భిన్నంగా ఉండబోతోంది.
12-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది. యునికార్న్‌లోని 18-అంగుళాల చక్రాలకు వ్యతిరేకంగా SP160 17 అంగుళాల చక్రాలతో రూపుదిద్దుకుంది. యునికార్న్ ధర రూ.1,09,800 (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, వచ్చే నెలలో SP160 విడుదలైతే దాదాపు యునికార్న్ ధరకు సమానంగా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అత్యంత స్టైలిష్‌గా ఇది ఉండబోతోందని హోండా ప్రతినిధులు చెబుతున్నారు. ఇది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్ కు గట్టిపోటీ ఎదురుకాబోతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications