ముద్దు పెట్టుకోవడంవల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తల్లికి తన పిల్లల మీద ఉన్న ప్రేమను, భర్తకు భార్యపై, ప్రేమికుడు ప్రియురాలిపై.. ఇలా ఎవరు ఎవరిపై ఎంత ప్రేమ ఉన్నా దానిని వ్యక్తీకరించడానికి ఉన్న ఉత్తమమైన మార్గం ముద్దు. దీనివల్ల ఎదుటి వ్యక్తికి మనం ఏమీ చెపపకుండానే వారిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచవచ్చు. ముద్దులు పెట్టుకోవడంవల్ల అనుబంధం బలపడుతుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముద్దుల వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.

ఒకర్ని ఇంకొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా మెదడు నుంచి రసాయనాలు విడుదలవుతాయి. విడుదలైన రసాయనాలు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల మంచి అనుభూతి కలుగుతుంది.

how many benefits of kissing?

భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం వల్ల శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఒత్తిడి అనేక వ్యాధులు రావడానికి కారణమవుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే కార్టిసాల్ ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ముద్దు పెట్టుకొనే సమయంలో గుండె కొట్టుకుంటుంది. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. శరీరంలో ఈ ప్రక్రియ సజావుగా సాగడంవల్ల రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

ముద్దువల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి తలనొప్పి, కడుపునొప్పి లాంటి సమస్యలు దూరమవుతాయి.

ముద్దు వల్ల రోగనిరోధక వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. వాస్తవానికి ముద్దు ద్వారా నోట్లోకి బదిలీ అయ్యే కొత్త జెర్మ్స్ హాని చేయవుకానీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పుప్పొడి, దుమ్ము పురుగుల వల్ల కలిగే అలర్జీ లక్షణాలను ముద్దు తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల అలర్జీలు ఎక్కువ అవుతాయి. ముద్దులు పెట్టుకోవడం ఒత్తిడి తగ్గతుందనే విషయం తెలిసిందే. ఇటువంటి విషయాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగివుంటాయి.

7. మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం పరస్పర బంధాన్ని బలపరుస్తుంది. మీరు చాలా కాలం పాటు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+