ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా..?
ఏపీ రాజకీయ ఫలితాలు ఏకపక్షంగా సాగాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో 151 సీట్లలో అధికారంలోకి వచ్చిన వైసీపీ..ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి.
రాయలసీమ జిల్లాలో సైతం వైసీపీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఇక ఎవరూ ఊహించని విధంగా జనసేన అధిక స్థానాల్లో విజయం సాధించి అందర్ని ఆశ్చర్యపరించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థలందరూ కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పిఠాపురం నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటానని తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్‌కు ఎంత జీతం వస్తుందో అనే చర్చ మొదలైంది. ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇతర అలవెన్స్‌లను అన్ని కలుపుకుని 3.35 లక్షల జీతం అందుకుంటున్నారు. పవన్‌కు సైతం అదే జీతం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రమే రూ. 4 లక్షలు జీతం అందుకుంటున్నారు.












Click it and Unblock the Notifications