ఓటరు స్లిప్ అందకపోతే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తవగా 13వ తేదీన నాలుగో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలోనే ఏపీలోని 25 లోక్ సభ నియోజకవర్గాలతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు కూడా అదేరోజు పోలింగ్ జరుగుతోంది.

పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంల తరలింపు, పోలింగ్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీని పెంచడంలాంటివి శరవేగంగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లకు స్లిప్ లు అందించేందుకు బీఎల్వో అధికారులు కృషిచేస్తున్నారు. అయితే కొంతమందికి స్లిప్స్ అందుతున్నప్పటికీ మరికొందరికి మాత్రం అందడంలేదు.

how to download your voter slip online details here

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
ఓటరు స్లిప్ అందనివారు చాలావరకు ఓటు వేయడానికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటివారు ఓటరు స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేసింది. ఈ స్లిప్ పై ఓటరుకు సంబంధించిన వివరాలుంటాయి. క్యూఆర్ కోడ్, ఓటరు పేరు ఉంటాయి. ఓటరు సమాచారంతో కూడిన ఈ స్లిప్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ యాప్, వెబ్‌సైట్ లేదంటే ఓటర్ హెల్ప్‌లైన్ నుంచి స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ స్లిప్‌పై ఓటరు పేరు, వయసు, లింగం, అసెంబ్లీ నియోజవకవర్గం, పోలింగ్ స్టేషన్ లొకేషన్, పోలింగ్ రూం నంబర్, పోలింగ్ తేదీ, సమయంతోపాటు ఆ స్లిప్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఓటరు వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి
ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భారత రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ఆరోజు ఓటు వేయాలని, మనకు సంబంధం లేదు అని ఎవరూ ఇంట్లో ఉండొద్దని, అలా ఉంటేనే తప్పుచేసినవారిమవుతామంటున్నారు. ఓట్లు వేయడానికి ఓటర్లు చైతన్యవంతులు కావాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు.

1950కి ఎస్ఎంఎస్ చేయాలి. ECI స్పేస్ ఓటరు ఐడి
ఇలా చేయగానే 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+