Ysrcp: అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో భారీ ట్విస్ట్?

తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ కోసం పోలీసులు ఆడిన డ్రామాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి అతి భారీ ట్విస్టు ఒకటి వెలుగు చూసింది.

అనంతబాబు అపార్ట్ మెంట్ వద్ద జరిగిన గొడవలో సుబ్రమణ్యం కింద పడిపోవడంవల్లే మృతిచెందాడని మీడియా సమావేశంలో స్వయంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీయే చెప్పారు. కానీ ఆరోజు అపార్ట్ మెంట్ వద్ద ఎటువంటి గొడవ జరగలేదని ఆ అపార్ట్ మెంట్ వాచ్ మెన్, మృతుడి బాబాయి అయిన శ్రీను తెలిపారు. సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించగా ఎస్పీ చెప్పినట్లుగా ఆరోజు అక్కడ ఆ సమయంలో ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టమైంది.

huge twist in MLC Anantha Babu car driver subramanyam murder case.. sp said false?

సుబ్రమణ్యంను తీసుకువచ్చినరోజు రాత్రి 12.00 గంటలకు అనంతబాబు హడావిడిగా తన భార్యతో తిరిగి అపార్ట్ మెంట్ కు వచ్చారని, తర్వాత మళ్లీ ఒంటిగంటకు వెళ్లిపోయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. అనంతబాబుకు సంబంధించిన జన్మదిన వేడుకలు కూడా జరగలేదని శ్రీను మీడియాకు చెప్పారు.

అసలు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, సుబ్రమణ్యం తండ్రి తనకు ఫోన్ చేసి ప్రమాదంలో మరణించినట్లు చెప్పారన్నారు. అనంతబాబు సాయంత్రం నాలుగు గంటలకు తన భార్యతో వెళ్లి అర్థరాత్రి 12.00 గంటలకు తిరిగి వచ్చారని, పోలీసులెవరూ తమ దగ్గరకు రాలేదని శ్రీను తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+