నా భార్యతో లింక్;నన్ను చంపేస్తానంటున్నాడు:భర్త ఫిర్యాదు;ఎమ్మెల్యే గన్ మాన్ పై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా: తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకుని టూర్లు తీసికెళ్లడమే కాకుండా ఇదేమని అడిగినందుకు తనను తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతానని బెదరిస్తున్నాడంటూ ఓ భర్త చేసిన ఫిర్యాదు మేరకు తుని ఎమ్మెల్యే గన్‌మేన్‌ మెరపల నాగకన్నయ్యపై కేసు నమోదైంది.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి ఎస్‌ఐ కృష్ణమాచారి తెలిపిన వివరాల ప్రకారం...శ్రీనివాసరావు అనే వ్యక్తి అన్నవరంలో ఓ లాడ్జి నడుపుతున్నాడు. అయితే మూడేళ్ల క్రితం శ్రీనివాసరావుకి గుండె జబ్బు రావడంతో తన భార్య సాయంతో లాడ్జి వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. ఈ క్రమంలో తుని ఎమ్మెల్యే వద్ద గన్‌మేన్‌గా పని చేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మెరపల నాగకన్నయ్య తరచూ లాడ్జి వద్దకు వస్తూ తన భార్యను మాయమాటలతో లోబర్చుకున్నాడని వెంట తిప్పుకున్నాడని భర్త శ్రీనివాసరావు ఫిర్యాదులో తెలిపాడు.

వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శ్రీనివాసరావు ఆరా తీసి... 2015లో సెప్టెంబరు19, 24,అక్టోబరు 7వతేదీల్లో వీరిద్దరూ విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో బస చేసినట్లు ఆధారాలు సంపాదించాడు..దీంతో భార్యను ఈ విషయమై హెచ్చరించాడు...అయితే డిసెంబర్ నెల 24వ తేదీన మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లి...తిరిగి తన భార్యను కారులో ఇంటి దగ్గర దిగబెడుతుండగా తాను చూసి కానిస్టేబుల్‌తో ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించానని, దానికి కానిస్టేబుల్ తన మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని బాధితుడు తెలిపాడు.

అంతేకాకుండా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వద్దకు మళ్లీ యూనిఫాం తిరిగొచ్చి చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో వివరించాడు. ఆ తరువాత కూడా తన వద్దకు మరో వ్యక్తి యానపల్లి శివను పంపి చంపేస్తామని బెదరిస్తున్నట్లు తెలిపాడు. దీంతో భయపడిన భర్త శ్రీనివాసరావు తన ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతో తొండంగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గన్ మన్ నాగకన్నయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొండంగి ఎస్‌ఐ కృష్ణమాచారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+