హీరోయిన్ లా ఉన్నావన్నాడు. పెళ్ళిచేసుకొన్నాక జుట్టు కత్తిరించాడు, ఆమె ఏం చేసిందంటే

అచ్చం హీరోయిన్ లా ఉందని ప్రేమించి ప్రసన్న అనే యువతి పెళ్ళిచేసుకొన్నాడు వివేక్. వీరిద్దరూ కాకినాడలో ఉంటారు. పెళ్ళైన ఏడాది కాకముందే భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె జుట్టు కత్తిరించడమే కాకుండా

కాకినాడ :ప్రేమించాడు, తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకొన్నాడు, హీరోయిన్ లా ఉందని ఆమెను వెంటాడి పట్టుబట్టి పెళ్ళిచేసుకొని ఏడాది తిరగకుండానే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ముఖంపై కత్తిగాట్లు పెడుతూ, ఆమె జుట్టును కత్తిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. బాదితురాలికి మహిళసంఘాలు అండగా నిలుస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడకు చెందిన ప్రసన్నను వివేక్ ప్రేమించానని వెంటపడ్డాడు. అచ్చం హీరోయిన్ లా ఉందని ఆమెనే పెళ్ళిచేసుకొంటానని పెద్దలను ఎదరించాడు. ఆమెను వివాహం చేసుకొన్నాడు. ఆరు మాసాల పాటు వారి కాపురం బాగానే సాగింది. అయితే ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపుల నుండి తనను రక్షించాలని ఆమె కోరుతోంది.

ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే వాడు. ఉద్యోగం కోసం లంచాల పేరుతో లక్షల రూపాయాలను అత్తమామల నుండి తీసుకొన్నాడు. తనకు విడాకులివ్వాలని భార్య ప్రనన్నను వేధించాడని ప్రసన్న ఓ తెలుగు టివీ చానల్ కు చెప్పింది.ఈ విషయమై ఆమెను ప్రతిరోజూ వేధించేవాడు. విడాకులకు ఒప్పుకోకపోవడంతో ఆమె జుట్టును కత్తిరించాడు.

husband harassing his wife ,woman organasations supporting to victim

ముఖంపై కత్తితో గాట్లు
పిల్లలు వద్దని ఆమెను కడుపుపై తన్నాడని , తర్వాత అబార్షన్ చేయించాడని బాధితురాలు ఆ చానల్ కుచెప్పారు. తనను మూడు పూటల కనీసం తిండి కూడ సక్రమంగా తినకుండా వేధించేవాడని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేసింది.ఈ విషయాలన్నీ ప్రశ్నించినందుకు తనను తీవ్రంగా కొట్టేవాడని, గత నెలలో తన జుట్టును కత్తిరించాడని ఆమె చెప్పారు. తాను అందంగా కన్పించకుండా ఉండేందుకు గాను ముఖంపై, ఛాతీపై కత్తిగాట్లు పెట్టాడని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రసన్న కుటుంబసభ్యులు చెప్పారు. అయితే భర్త అరాచకాలను తెలుసుకొన్న మహిళా సంఘాలు ప్రసన్నకు అండగా నిలిచాయి.అయితే మరో పెళ్ళి చేసుకొనేందుకే వివేక్ ప్రసన్నను ఇబ్బందులకు గురిచేసేవాడని ప్రసన్న తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. వివేక్ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+