నల్లగా ఉందని భార్యను వదిలేసిన భర్త.. నెక్స్ట్ ఏం చేసిందంటే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నెల్లూరు జిల్లాలో ఓ మహిళ తన అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. ఆమె తన భర్త ప్రసన్నకుమార్ ఇంటి ముందు న్యాయం కోసం పోరాటం చేస్తోంది. దీంతో అసలు ఏం జరిగింది ? ఆ విషయం ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని హరిజనవాడకు చెందిన ప్రసన్నకుమార్‌తో ఎనిమిది నెలల క్రితం ఓ మహిళకు వివాహం జరిగింది. అయితే ఆమె నల్లగా ఉందనే కారణంతో తన భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా బయటకు గెంటేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. పెళ్లయినప్పటి నుంచే తనను నిందిస్తూ.. నల్లగా ఉన్నావని రోజూ వేధించేవాడని వాపోయింది. పెళ్లి అయిన మొదటి నెలలోనే 50 వేలు ఇస్తానంటూ వెళ్లిపోవాలని బలవంత పెట్టాడని కూడా కన్నీటి పర్యంతం అయ్యింది.

వేధింపులు భరించలేక ఓసారి సూసైడ్ చేసుకోవడానికి కూడా యత్నించానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తనపై ఇలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.












Click it and Unblock the Notifications