Vakeel Saab: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... వకీల్ సాబ్‌కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్ మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. ఇందుకోసం జే మీడియా ఫ్యాక్టరీకి ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

తేల్చి చెప్పిన పోలీసులు....

తేల్చి చెప్పిన పోలీసులు....

ప్రి రీలీజ్ ఈవెంట్ నిర్వహణకు అనుమతి కోరుతూ జే మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5వేల నుంచి 6వేల మంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హాజరవుతారని పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా అమలుచేస్తుండటంతో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఈ ఈవెంట్‌కు బ్రేకులు పడినట్లయింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలో బహిరంగ ఉత్సవాలు,సభలు,సమావేశాలు,ఊరేగింపులపై ఏప్రిల్‌ 30 వరకు ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యా సంస్థలన్నింటినీ మూసివేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ సినిమా ఈవెంట్‌కు కూడా పోలీసులు నో చెప్పారు.

ఫ్యాన్స్ నిరాశ...

ఫ్యాన్స్ నిరాశ...

వకీల్ సాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్ పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ అయిన థియేటర్లకు అభిమానులు వందలాదిగా పోటెత్తారు. విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్‌లో ఏకంగా అద్దాలు పగలగొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో గాయాలైనా వారు లెక్కచేయలేదు. కేవలం ట్రైలర్ రిలీజ్‌కే ఇంత భారీ స్పందన రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. యూట్యూబ్‌లో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్‌కు ఇప్పటికే 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్రైలర్‌తోనే రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా... ఇక విడుదలయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు...

ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు...

ఈ నెల 9న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకుముందు రోజు మిడ్ నైట్ షోలను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మిడ్ నైట్ నుంచి మూడు షోలు ప్రదర్శించేలా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా ఈ షోలకు రూ.1500 టికెట్ ధరగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బెనిఫిట్ షోలు,సాధారణ షోలకు కూడా ధరలు భారీగానే పెంచినట్లు సమాచారం. దీంతో విడుదల రోజే వకీల్ సాబ్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+