ఎప్పుడూ లేను, భవిష్యత్తులో: రాజకీయాలపై జూ.ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ప్రయివేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఎప్పుడు రాజకీయాలలో లేనని, అలాగే భవిష్యత్తులో ఉంటానో లేదో తెలియదని అభిప్రాయపడ్డారు.

తనకు తెలిసింది కేవలం సినిమాలేనని చెప్పారు. తాను ఎప్పుడు కూడా రాజకీయాలలో లేనన్నారు. ముందు ముందు ఉంటానా లేదా చెప్పలేనని అన్నారు. ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలన్నారు. రాజకీయాలు డిఫరెంట్ సబ్జెక్ట్ అని, అది చాలా పెద్ద బాధ్యత అన్నారు.

మొదట నేను ఈ భారత దేశానికి మంచి సిటిజన్‌గా, నా పిల్లలకు మంచి తండ్రిగా, నా తల్లికి మంచి కొడుకుగా ఉంటానని చెప్పారు.

I am not in politics, that is more responsible: Jr NTR

కాగా, జూ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం పైన గతంలో పలుమార్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 2009లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత టిడిపికి చంద్రబాబు వారసుడిగా జూ.ఎన్టీఆర్ పేరును కొందరు తెరపైకి తీసుకు వచ్చారు.

ఈ విషయమై హరికృష్ణ.. పార్టీ అధిష్టానం పైన మండిపడిన సందర్భాలు ఎన్నో. ఆ తర్వాత చాలా రోజుల పాటు టిడిపి వారసుడిగా ఓ వైపు ఎన్టీఆర్, మరోవైపు నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై పరోక్ష వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో 2014లో జూ.ఎన్టీఆర్ టిడిపికి ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల పైన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+