ఆశోక్‌గజపతిరాజు టిడిపికి షాకిస్తారా, ఏం చెప్పారంటే?
విజయనగరం:బిజెపిలో తాను చేరుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు కొట్టిపారేశారు. తాను టిడిపిలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణలో శాఖ మార్పు అనేది తన పరిధిలోని అంశం కాదన్నారు ఆశోక్‌గజపతిరాజు
కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉందన్నారు. టిడిపి ఎంపీగా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నట్టుగా ఆశోక్‌గజపతిరాజు గుర్తు చేశారు. రాజకీయాల్లో ప్రమోషన్లు, డీమోషన్లు ఉండవన్నారు ఆశోక్‌గజపతిరాజు.

అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో టిడిపి నుండి మరోకరికి పదవి దక్కే అవకాశం ఉందని కూడ ప్రచారంలో ఉంది. ఈ తరుణంలో ఆశోక్‌గజపతిరాజు పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ ప్రచారంపై ఆశోక్‌గజపతిరాజు స్పష్టతనిచ్చారు.












Click it and Unblock the Notifications