Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యలమంచిలి రవి యూ టర్న్: బాబుతో భేటీ, టిడిపిలోనే కొనసాగుతా

అమరావతి: టిడిపి నేత యలమంచిలి రవి యూటర్న్ తీసుకొన్నారు. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను పాదయాత్రలో టిడిపి నేత యలమంచిలి రవి కలుసుకొన్నారు. అయితే ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరుతారని భావించారు. కానీ ఆదివారం నాడు పరిణామాలు మారిపోయాయి. టిడిపిలోనే కొనసాగుతానని యలమంచిలి రవి ప్రకటించారు.

కృష్ణా జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలో టిడిపికి చెందిన యలమంచిలి రవి జగన్‌ను పాదయాత్రలో కలుసుకొన్నారు. ఈ తరుణంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొంటారని భావించారు.

Im not leaving TDP Says Yalamanchili Ravi

2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి యలమంచిలి రవి పిఆర్పీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు యలమంచిలి రవి టిడిపిలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన విజయవాడ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయింపు తదితర విషయాలపై టిడిపి నాయకత్వం నుండి స్పష్టత లేని కారణంగానే యలమంచిలి రవి వైసీపీలో చేరాలనుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన వైఎస్ జగన్‌ను కలుసుకొన్నారని సమాచారం.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్దకు యలమంచిలి రవిని తీసుకెళ్ళారు. సమారు గంటకు పైగా యలమంచిలి రవితో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత తాను టిడిపిలోనే కొనసాగుతానని యలమంచిలి రవి ప్రకటించారు.

పార్టీ మారే ఆలోచన తనకు లేదన్నారు. అయితే పార్టీ మారాలనుకొన్న మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించిన తర్వాత తాను సంతృప్తి చెందినట్టు ఆయన చెప్పారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకొన్నానని ఆయన తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+