మోడీ గొప్ప నటుడు, గంటన్నరసేపు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చూశా: కేశినేని నాని

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ఆయన రైట్ టు రిప్లై కింద మాట్లాడారు. మోడీ ప్రపంచంలోనే గొప్ప నటుడు అన్నారు. ప్రధాని మోడీ గొప్ప నటన, నాటకీయత, హావభావాలతో ప్రసంగించారన్నారు. 2014కు ముందు కూడా ఇలాగే నటించారన్నారు.

దాదాపు గంటన్నరసేపు సమ్మోహనరీతిలో ఆయన ప్రసంగించారన్నారు. ప్రధాని అవాస్తవ గణాంకాలు, వివరణలు చెప్పారన్నారు. ప్రధాని ప్రసంగం బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రాన్ని తలపించిందన్నారు. ప్రధాని ప్రసంగంలో ఏపీ హామీలను నెరవేర్చే అంశం ఏదీ లేదన్నారు.

I thought for one and a half hours I was watching a Bollywood blockbuster film: Kesineni Nani

దాదాపు గంటసేపు నేను బాలీవుడ్ బ్లాక్ బస్టర్ (ప్రధాని మాట్లాడినంత సేపు) సినిమా చూసినట్లుగా భావించానని, మోడీ ప్రపంచంలోనే బెస్ట్ యాక్టర్ అనే దాంట్లో తనకు ఎలాంటి అనుమానం లేదని ఎద్దేవా చేశారు.

కాగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 12 గంటల పాటు చర్చ జరిగింది. ఓటింగులో 451 మంది పాల్గొన్నారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 మంది, అనుకూలంగా 126 మంది వేశారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+