• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ వైసీపీ నేతకు ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలు..చనిపోయినా పర్వాలేదు: శ్రీరెడ్డి సంచలనం

|

కర్నూలు: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీరెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ ఎదుటే టాప్ లెస్ గా నిరసన వ్యక్తం చేసిన అనంతరం తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. టాలీవుడ్ పెద్దలను టార్గెట్ గా చేసుకుని సంచలన ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తూ వివాదాలను రేకెత్తిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా ఘాటు విమర్శలు చేయడానికి ఏ మాత్రం సంకోచించని శ్రీరెడ్డి.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కన్నేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తన ప్రేమను వ్యక్తం చేశారు.

బైరెడ్డికి భార్యగా ఒక్కరోజు ఉన్నా చాలు..

బైరెడ్డికి భార్యగా ఒక్కరోజు ఉన్నా చాలు..

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్.. విపరీతంగా వైరలైంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని షేక్ చేసి పడేస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. మరి కొందరు ఆయనను వదిలేయ్ తల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బైరెడ్డికి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను ట్రై చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

ఫైర్ బ్రాండ్ గా ముద్ర..

ఫైర్ బ్రాండ్ గా ముద్ర..

కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన యువ నాయకుడు. ఆయనది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. తెలుగుదేశం తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకుడిగా పనిచేస్తున్నారు. నందికొట్కూరు రిజర్వుడ్ స్థానం కావడం వల్ల పోటీ చేయలేకపోయారు. అక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. బైరెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది.

నువ్వు మగాడివిరా బుజ్జీ...

నువ్వు మగాడివిరా బుజ్జీ...

సిద్ధార్థ్ రెడ్డిలోని ఆ ఫైర్ బాగా నచ్చినట్టుంది శ్రీరెడ్డికి. అందుకే వరుసగా పోస్టులు పెట్టారు. తొలిసారిగా తన పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నానని కామెంట్ ను పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. నువ్వు మగాడివిరా బుజ్జీ అంటూ సిద్దార్ధ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్కరోజైనా ఆయనకు భార్యగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు. అని తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ పై వైసీపీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనను తీసుకొస్తోంది. చాలామంది వైసీపీ నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు. మరి కొందరు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నాడని, ఆయనను వదిలేయాలని కోరుతున్నారు.

English summary
Tollywood actress Srireddy was trolled by YSR Congress Party Social media wing for her comments on Party's young leader Byreddy Sidharth Reddy. Srireddy expressed that If I can b wife to Byreddy sidharth Reddy atleast for 1 day,enough..after that if I die also ok. She has posted some comments on Byreddy in her Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more