బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల పైన వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. దీంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్ర దేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోందన్న ఐఎండీ పేర్కొంది. దీంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆది వారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరిం చింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలం టూ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

imd-alerts-on-heavy-rains-for-telugu-states-due-to-low-depression-in-bay-of-bengal

శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. అదే విధంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల పడే అవకాశముందని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక, హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది.

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు ముసురు, చిరుజల్లులతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. నాగోల్‌ రాక్‌టౌన్‌ కాలనీ, హయత్‌నగర్‌, వనస్థలిపురం, మధురానగర్‌, ఉప్పల్‌, బండ్లగూడ, బహుదూర్‌పురా, సైదాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌ ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండు రోజులు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+