బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. 27నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతరం పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుతుండగా బలపడుతుందని పేర్కొంది. మరో వైపు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి.
రెండు రోజులు వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో వీస్తున్న గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అన్నమయ్య జిల్లా కలకడలో 62.2 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా నూజివీడులో 36.8, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 28.2, బాపట్లలో 24.2, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 22.8, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 21.4, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 20.4 , ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 18.4, బాపట్ల జిల్లా రేపల్లెలో 18.2, బాపట్ల జిల్లా కారంచేడులో 18.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
పెరుగుతున్న చలి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు/ ఆగ్నేయ దిశలో 6-10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున పగటిపూట 28-32 డిగ్రీల మధ్య, రాత్రిపూట 17-19 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

కొనసాగుతున్న వర్షాలు: చాంద్రాయణగుట్టలో 6.8 మి.మీ, రాజేంద్రగనగర్‌లో 5.5, నగరంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 4.8 సెం.మీ, యాదాద్రిలో 3.9 సెం.మీ వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, శుక్రవారం సిద్దిపేట జిల్లా సింగారంలో 60, ములుగు జిల్లా మేడారంలో 54, నల్గొండ జిల్లా తెల్థేవరపల్లిలో 43, హన్మకొండ జిల్లా దామెరలో 37, నల్గొండ జిల్లా చందంపేటలో 29, నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వర్‌లో 28, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 27, మేడిపల్లి, పాలకుర్తిలలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications