లోకేష్ "మెగా"స్త్రం - జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం: అక్కడే..అసలు ట్విస్ట్..!?

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు.

వచ్చే ఎన్నికల్లో అధికారమే టీడీపీ లక్ష్యం. ఇందుకోసం ఏ అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేదు. అటు చంద్రబాబు నేరుగా పవన్ తో పొత్తుల దిశగా అడుగులు వేస్తుంటే..ఇటు లోకేష్ వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పలికారు. ఇప్పటి వరకు జూనియర్ టీడీపీలో రీ ఎంట్రీకి లోకేష్ కారణమంటూ జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు. అదే సమయంలో జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ తనకు చిరంజీవిపైన ఉన్న అభిమానం చాటుకున్నారు. పవన్ మనసు మంచిదంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ ఎన్నికల వేల జా ఎన్టీఆర్ కు ఆహ్వానించారు..మరి తారక్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు.. స్పందిస్తారా..లోకేష్ సంధించిన "మెగా"స్త్రం ఫలితం ఇస్తుందా..

మెగాస్టార్ పై అభిమానం.. పవన్ మంచి మనసు

మెగాస్టార్ పై అభిమానం.. పవన్ మంచి మనసు

యువగళం ద్వారా రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న టీడీపీ నేత లోకేష్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా కొత్త రాజకీయం ప్రారంభించారు. అటు అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే..కొత్త అడుగులు వేస్తున్నారు. తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు. కీలక అంశాలకు ఈ వేదికను సద్వినియోగం చేసుకున్నారు. తనకు చిరంజీవి పైన ఉన్న అభిమానం చాటుకొనే ప్రయత్నం చేసారు. తాను చిరంజీవి అభిమానని చెప్పుకొచ్చారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చూసానని చెప్పారు. బాలయ్య మామ తనకు ముద్దుల మావయ్య అంటూ..అన్ స్టాపబుల్ అని తన ప్రేమ చాటుకున్నారు. ఇక, జనసేనతో పాత్తు ఖాయమవుతున్న వేళ పవన్ కల్యాన్ గురించి స్పందించారు. పవన్ కు మంచి మనసు ఉందని..2014 ఎన్నికల్లోనే తాను పవన్ లో ఆ మంచి మనసు చూసానని చెప్పారు. పవన్ లాంటి వారు రాజకీయాల్లో ఉండాలన్నారు.
జూనియర్ కు లోకేష్ ఆహ్వానం..

జూనియర్ కు లోకేష్ ఆహ్వానం..


2009 ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసారు. ఆ తరువాత పార్టీ వ్యవహారాల్లో దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పార్టీలో లోకేష్ కారణంగానే జూనియర్ కు అవకాశం దక్కటం లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో..అటు పవన్ గురించి ప్రస్తావన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. జూ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా అనే ప్రశ్నకు లోకేష్ లౌక్యంగా సమాధానం ఇచ్చారు. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తామన్నారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో.. ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి.. ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్లాలని., ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలని జూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసారు.

తారక్ స్పందిస్తారా...వాట్ నెక్స్ట్

తారక్ స్పందిస్తారా...వాట్ నెక్స్ట్


ఇప్పుడు జూనియర్ కోర్టులోకి లోకేష్ పొలిటికల్ బాల్ నెట్టేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పైన లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఇక జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పూర్తిగా సినిమాల పైనే జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ చేసారు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసారు. వాటిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పి కొట్టారు. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. లోకేష్ ఆహ్వానించినా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సమయంలో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. అటు పవన్ కల్యాన్..ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ ఎన్నికల వేళ బ్యాలెన్స్ చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+