వామ్మో టమోటా, యాపిల్ లాంటి కలర్, అదే రైంజ్ లో రగిలిపోతున్న ధరలకు, మదనపల్లెలో !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిపోవడంతో వ్యాపారాలు వారివారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక మామూలుగా నగరాలు, పట్టణాల్లో ఉండే రాజకీయాలను తలతన్నేలా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని టమోటా రైతులు ఇప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి సంతోషంగా టమోటా పంట లాభాలను చూస్తూ హ్యాపీగా ఉంటున్నారు.
దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె (ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఊరు)లో అతి పెద్ద టమోటా మార్కెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు మదనపల్లె టమోటా మార్కెట్ నుండి టమోటాలు ఎగుమతి అవుతుంటాయి. అలాంటి మదనపల్లె టమోటా మార్కెట్ లో టమోటాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

శుక్రవారం మదనపల్లె టమోటా మార్కెట్ లో కేజీ నాణ్యమైన టమోటాల ధర రూ. 44 పలికింది. 25 కేజీల ప్లాస్టిక్ బాక్స్ కేట్ రూ. 1,100 వరకు పలికింది. 25 కేజీల టమోటా కేట్ అత్యల్పంగా రూ. 575 నుంచి రూ. 1,110 వరకు పలకడంతో టమోటా పంటలు వేసిన రైతులు చాలా సాంతోషంగా ఉన్నారు. ప్రతి యేడాది మార్చి నెలలో మదనపల్లె టమోటా మార్కెట్ లో వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.
అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రారంభం అయ్యింది. టమోటా మార్కెట్ ప్రారంభం అయినా, తక్కువ సరుకు వచ్చినా టమోటాల ధర మాత్రం ఎక్కువ పలకకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అయితే రెండు వారాల నుంచి టమోటాల ధరలు రానురాను పెరుగుతున్నాయి. మదనపల్లె మార్కెట్ కు మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గంతో పాటు పుంగనూరు, తంబళపల్లె, పీలేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలు తీసుకు వచ్చి విక్రయిస్తున్నారు.
టమోటాల దిగుమతి తక్కువ ఉంది ఎగుమతి ఎక్కువ ఉండటంతో టమోటాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. టమోటా ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో టమోటాల లోడ్ల టమోటాలు మదనపల్లె మార్కెట్ కు వస్తుంటాయి. మొత్తం మీద మరోసారి మదనపల్లె టమోటా మార్కెట్ వైపు రైతులు ఎగబడుతున్నారు.












Click it and Unblock the Notifications