హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ కోరిక వీజీగా తీరదు కానీ: శ్రీమతి అమితా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా నిర్మాణ రంగంలో పలు ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేసిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ తాజాగా ఓసమ్ అడ్డా పేరిట సుమారు 240 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోకొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించింది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు.

ప్రాజెక్టు లోగోను శ్రీమతి అమితా పీయుష్(మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు డిటిసిపి అనుమతులు ఉన్నాయని తెలిపారు.

మొత్తం సంస్థలోని 215 ఎకరాలలో లేఔట్‌లు గీశామని, పది ఎకరాల స్థలాన్ని ప్రత్యక్ష నిర్మాణాలకు, మరో ఐదు ఎకరాలకు రిసార్ట్ తదితరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. చౌక ధరలో లభిస్తూ, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 1

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 1

చదరపు గజాన్ని రూ.1,667 అందిస్తున్నామని, అది కూడా నెలకు రూ.5,500 చెల్లిస్తూ, 40 నెలల కాల వ్యవధిలో స్థలాన్ని పొందవచ్చునని, ఈ ప్రాజెక్టుకు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని, దీనికి అదనంగా రూ.12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రవీణ్ తెలిపారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 2

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 2

మొత్తం 240 ఎకరాల్లో పదిశాతం భూమిని పార్కింగ్ కోసం, మరో ముప్పై శాతం భూమిని రహదారుల కోసం కేటాయించామని, డ్రయినేజీ, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక వసతుల కల్పన వేగంగా పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 3

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 3

'మొత్తం 202 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 2.19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచానా. దీంతో పాటు 2030 నాటికి కనీసం పది లక్షల ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. హైదరాబాదు తూర్పు ప్రాంతంలోని ప్రాజెక్టు సైబరాబాద్ డెవలప్‌మెంట్ ఏరియా, హైదరాబాద్ ఎయిర్ పోర్టు డెవలప్‌మెంట్ ఏరియాతో పాటు మహేశ్వరం, ఉప్పల్, పోచారం ప్రాంతాలను కలుపుతుంది' అని ప్రాజెక్టు గురించిన సమాచారం ఇచ్చారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 4

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 4

శ్రీమతి అమితా పీయూష్ మౌత్వాన్ మాట్లాడుతూ.. ప్రతి మధ్య తరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న కోరిక ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులభంగా తీరేది కాదని కానీ ఇన్‌క్రెడిబుల్ ఇండియా చేపట్టిన ఈ ప్రాజెక్టు వారి కోరికను ఎంతో సులభంగా తీరుస్తుందని చెప్పారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 5

ఇన్‌క్రెడిబుల్ ఇండియా 5

అందుబాటు ధరల్లో స్థలాన్ని అందించాలని ప్రాజెక్టులు చేపడుతున్నారని అమితా పూయూష్ మౌత్వాన్ తెలిపారు. సంస్థ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేటి తరం కస్టమర్లు అత్యంత నమ్మకమైన కంపెనీలను కోరుతున్నారని, నిర్మాణ రంగంలో తమ వాంఛలను తీర్చే కంపెనీలకు పెద్ద పీట వేస్తున్నారనడంలో సందేహం లేదన్నారు.

English summary
Incredible India Projects Pvt Limited has announced the launch of a satellite township project about 59 km from the metropolis of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X