బిగ్ అలర్ట్: వాట్సాప్‌లో భారతీయ రైల్వే కొత్త యాప్

ప్రయాణికులను అత్యంత తక్కువ ధరలో, భద్రంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో భారతీయ రైల్వే ముందుంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఎంతో సౌకర్యవంగా అనిపిస్తుంది. అందుకే ప్రజలు ముందుగా రైలునే ఎంచుకుంటారు. ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను దేశవ్యాప్తంగా 13,600 రైళ్లు వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ రైల్వేతోపాటు ఇతర ప్రయివేటు సంస్థలు కూడా రైల్వే సమాచారం కోసం అనేక వెబ్ సైట్ లు, యాప్ లు అందుబాటులోకి తెచ్చాయి. వీటిద్వారా రైళ్ల టికెట్లతోపాటు వాటి పూర్తి సమాచారాన్ని పొందడం సులువవుతోంది.

వాట్సాప్ లో పొందొచ్చు
రైలోఫీ అనే సంస్థ ప్రయాణికుల కోసం ఒక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ఇందులో రైలు ప్రయాణ వివరాలతోపాటు వాటి సమయాలు, రైల్వే స్టేషన్లు, పీఎన్నార్ తదితరాలను తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ప్రయాణికులు ఏదైనా సమాచారం కావాలంటే 139 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటారు. రైల్వే హెల్ప్ లైన్ నుంచి అప్ డేట్ తీసుకుంటారు. ఇకనుంచి వాట్సాప్ లో కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను ముందుగా అప్ డేట్ చేసుకొని తర్వాత రైలోఫీ నెంబర్ +91-9881193322ని సేవ్‌ చేసుకోవాలి. కొత్త మెసేజ్ బటన్ ను క్లిక్ చేసి రైలోఫీ కాంటాక్ట్ ను ఎంచుకున్న తర్వాత పీఎన్నార్ నెంబరుతోపాటు ఇతర వివరాలు తెలుసుకోండి. రియల్ టైమ్ అప్ డేట్లు ఉంటాయని రైలోఫీ సంస్థ వెల్లడించింది.

india railway new app available in in whatsapp

అన్నిరకాల సమాచారం తెలుసుకోవచ్చు
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రయాణంలో ఏవైనా వస్తువులు పోగొట్టుకుంటే వాటిగురించి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే రైళ్లు రద్దయినా, బయలుదేరే సమయం వాయిదా పడినా, ప్రకృతి విపత్తుల సమయంలో ఏం చేయాలి? రైళ్ల సమయాలు, రైల్వేస్టేషన్ల సమాచారం.. ఇలా అన్నీ తెలుసుకొనే పరిజ్ఞానం ఇందులో ఉంది. ఇప్పటికే రైలు ప్రయాణికుల కోసం అనేకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐఆర్సీటీసీ యాప్ కూడా ఉంది. భారతీయ రైల్వే అధికారిక యాప్ అయిన నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టం ఉంది. ఇలా నిత్యం రెండుకోట్ల మంది ప్రయాణికులకు ఈ యాప్స్ సేవలందిస్తున్నాయి. తాజాగా రైలోఫీ కూడా వీటి సరసన చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+