కాపాడుకునేందుకే: గుట్టువిప్పిన హైదరాబాద్ టెక్కీ సల్మాన్?

హైదరాబాద్: అమెరికా పోలీసుల కళ్లుగప్పి ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ యువకుడు సల్మాన్ మొయినుద్దీన్ ఐఎస్ఐఎస్ గురించి మరిన్ని విషయాలు వెల్లడించాడు. తన వర్గం వాళ్లను కాపాడుకునేందుకే సిరియా బయలుదేరానని ఇంజనీర్ అయిన సల్మాన్ మొయినుద్దీన్(32) పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ మేరకు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

అమెరికా అధికారులు తన వీసా గడువు పెంచకుండా వెనక్కి పంపారని.. సందర్శక వీసాపైనే దుబాయ్ వెళ్తున్నానని తెలిపాడు. దుబాయ్‌లో ప్రియురాలిని పెళ్లాడి సిరియా వెళ్లాలని భావించినట్లు వెల్లడించాడు. దౌలాన్ న్యూస్ అనే ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఐఎస్‌పై ప్రచారం చేసినట్లు తెలిపాడు. దౌలాన్ న్యూస్‌లో చాలా మంది చేరారని తెలిపారు. దీన్ని అమెరికా అధికారులు గుర్తించారని చెప్పాడు.

Salman

ఈ క్రమంలో అధికారులు తన వీసా గడువును పెంచకుండా వెనక్కి పంపినట్లు తెలిపాడు. సల్మాన్‌ను శుక్రవారం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఉండగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొయినుద్దీన్ ల్యాప్‌టాప్‌ను సైబరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మొయినుద్దీన్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఉన్న వాళ్లనూ పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో సల్మాన్ ఐఎస్‌ఐఎస్ గురించి మరిన్ని విషయాలు వెల్లడించాడు.

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన ఓ ఇంజనీర్‌ సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్‌కు చేరుకుని అక్కడి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌తో సహా టర్కీ మీదుగా సిరియా చెక్కేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుని శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్‌పోర్ట్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.

అతని వద్ద నుంచి లాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్‌సైట్ల ద్వారా ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైదరాబాద్‌లోని బజార్‌ఘట్‌కు చెందిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ (32) బీటెక్‌ పూర్తిచేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ టెక్సాస్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+