Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023: బాలయ్య నయా అవతార్: అభిమానుల్లో జోష్

హైదరాబాద్/అమరావతి: ఇంకొన్ని గంటల్లో.. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ గ్రాండ్ గా ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.

ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పలువురు సెలెబ్రిటీలు పెర్‌ఫార్మ్ చేయనున్నారు. టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న, తమన్నా, ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్.. ఈ వేడుకల్లో మెరుపులు మెరిపించనున్నారు. 2018లో చివరిసారిగా ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ ఏర్పాటైంది. ఆ ఈవెంట్‌ లో పరిణీతి చోప్రా, వరుణ్ ధవన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ పెర్‌ఫార్మ్ చేశారు.

IPL 2023 CSK vs GT: Tollywood actor and MLA Nandamuri Balakrishna turned as commentator

దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. కామెంటరీ బాక్స్ లో అదరగొట్టనున్నారు. ఐపీఎల్ 2023 ఓపెనింగ్ మ్యాచ్ కు ఆయన కామెంటేటర్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన రంగంలోకి దిగారు. కొద్దిసేపటి కిందటే స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్ కు చేరుకున్నారు. మ్యాచ్ ముగిసేంత వరకూ ఆయన కామెంట్ కొనసాగే అవకాశం ఉంది. ఓ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ కోసం బాలయ్య కామెంటేటర్ అవతారం ఎత్తడం ఇదే తొలిసారి కావడం ఆసక్తి రేపుతోంది.

ఇలాంటి ఓ ఈవెంట్‌లో తన గళాన్ని వినిపించడం కూడా నందమూరి బాలకృష్ణ ఇదే తొలిసారి. టాలీవుడ్ ‌లో టాప్ హీరోగా మాత్రమే ప్రేక్షకులకు పరిచితుడైన ఆయన- అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే కోసం హోస్ట్ గా కనిపించారు. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే ఈ టాక్ షో సక్సెస్ ఫుల్ గా రన్ కావడానికి బాలకృష్ణే ప్రధాన కారకుడు. ఇప్పుడిక స్టార్ స్పోర్ట్స్ తెలుగు కోసం కామెంటేటర్ అవతారాన్ని కూడా ఎత్తడం ఆయన అభిమానుల్లో జోష్ నింపుతోంది.

ఐపీఎల్ 2023 సీజన్ కు టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, డీబీ రవితేజ, సందీప్ భావనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, జ్యోతి రమణ, ప్రత్యూష, జ్ఞానేశ్వరి.. ఫుల్ లెంగ్త్ తెలుగు కామెంటేటర్లుగా వ్యవహరిస్తోన్నారు. వారితో కలిసి నందమూరి బాలకృష్ణ కామెంటరీ బాక్స్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ కామెంటరీ బాక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన గళాన్ని వినడానికి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+