సుప్రీంకోర్టే తిరస్కరించింది..: ఏపీ ఐపీఎస్ సునీల్ కుమార్

PV Sunil Kumar IPS: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసులు, విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌పై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సునీల్ కుమార్‌‌పై బదిలీ వేటు పడింది. పోస్టింగ్ లభించలేదు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌లో ఉన్నారు.

IPS officer PV Sunil Kumar reacts after Police filed a case against him

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొంతకాలం పాటు ఆయన సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ పేరు సైతం చేర్చారు.

తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, అయదుమంది గుర్తు తెలియని వ్యక్తులతో హింసించారంటూ అప్పట్లో రఘురామ కృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. తనను కొడుతున్నారనడానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా తీశారని, దాన్ని వైఎస్ జగన్‌కు చూపించారని రఘురామ ఆరోపించారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారని చెప్పారు.

ఈ కేసు, పోలీసులకు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచిన అంశాలపై తాజాగా పీవీ సునీల్ కుమార్‌పై స్పందించారు. ఈ కేసు అప్పట్లో సుప్రీంకోర్టులో మూడు సంవత్సరాల పాటు నడిచిందని గుర్తు చేశారు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే దీన్ని తిరస్కరించిందని పేర్కొన్నారు.

అలాంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించారు. వాళ్ల విజ్ఞతకే వదిలి వేస్తోన్నానని పేర్కొన్నార. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు పీవీ సునీల్ కుమార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+