ఇక, మోడీ అవసరం లేదు!: పవన్ కళ్యాణ్‌తో ఇద్దరికీ, అన్నింటికీ బాబు చెక్?
2019 ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు పక్కన పెడతారా? ప్రత్యేక హోదాపై రివర్స్ గేర్ వేస్తారా? అంటే ఆ అవకాశాలు లేకపోలేదంటున్నారు.
అమరావతి: 2019 ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు పక్కన పెడతారా? ప్రత్యేక హోదాపై రివర్స్ గేర్ వేస్తారా? అంటే ఆ అవకాశాలు లేకపోలేదంటున్నారు.

అక్కడే చంద్రబాబు డైలమా, ఇరుకున పడ్డారు
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు ఏమాత్రం లేవని బిజెపి కుండబద్దలు కొడుతోంది. మరోవైపు, హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. హోదా విషయంలో చంద్రబాబు పట్టుదలకు వెళ్లడం లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకునే ఉద్దేశ్యం లేదు. ఇక్కడే చంద్రబాబు డైలమాలో పడ్డారని, ఇరుకున పడుతున్నారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో ఇలా..
వచ్చే ఎన్నికల్లో మరోసారి టిడిపిని అధికారంలోకి తీసుకు రావడమే చంద్రబాబు మొదటి లక్ష్యం అని చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం తిరిగి అప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలుంటాయి. ఏపీలో బిజెపి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. అదే సమయంలో హోదా అంశంలో ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో మాత్రం బిజెపిని టిడిపి దూరం పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

తెగతెంపులు తప్పవా?
కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఎన్నికలు అయ్యాక మరో విధమైన లెక్కలు ఉంటాయి. అదే సమయంలో బిజెపి కూడా టిడిపికి దూరం జరగాలనే చూస్తోంది. కాబట్టి తెగతెంపులు తప్పవేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపి-జగన్ కలిసి వెళ్లినా ఆశ్చర్యం లేదు.

పవన్ కళ్యాణ్ అవసరం కావాల్సిందే
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు బిజెపి అవసరం కంటే పవన్ కళ్యాణ్ అవసరమే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాపులు, యువత టిడిపికి అండగా నిలబడాలంటే జనసేనాని మద్దతు ఉండాలని టిడిపి నేతలు కూడా కోరుకుంటున్నారు.

తెలంగాణలోను కోరుకుంటున్నారు
తెలంగాణ టిడిపి నేతలే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహకారం తమకు ఉంటే బాగుండుందని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఏపీలో మరింత ప్రభావం చూపగలిగే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎందుకు దూరం చేసుకుంటారని అంటున్నారు.

ఒక్క పవన్ కళ్యాణ్‌తో అన్నింటికి చెక్.. ఎలా
పవన్ కళ్యాణ్ అండగా ఉంటే బిజెపికి, వైసిపి అధినేత జగన్‌కు చెక్ చెప్పవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదాతో ఇఫ్పటికే బిజెపి విమర్శలు ఎదుర్కొంటుంది. హోదాపై పోరాటంలో ఎక్కువ మంది జగన్ కంటే పవన్ కళ్యాణ్‌నే నమ్ముతున్నారు. చంద్రబాబు కూడా తాను కేంద్రం సహకారం కోసమే ఇన్నాళ్లు కలిసి ఉన్నానని చెప్పినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ముద్రగడ పద్మనాభంతో కాపులను తన వైపుకు మళ్లించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారనేది టిడిపి వాదన. పవన్ రంగంలోకి దిగితే దానికి చెక్ పెట్టవచ్చునని టిడిపి భావిస్తోంది. యువతలో పవన్‌కు మంచి క్రేజ్ ఉంది.

బిజెపి అంతంతే.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే
ఇటీవల చేసిన సర్వేలో జగన్‌కు 47 శాతం, టిడిపికి 45 శాతం, బిజెపికి 2.5 శాతం, పవన్ కళ్యాణ్‌కు 1 శాతం ఓట్లు వస్తాయని తేలిందని అంటున్నారు. పవన్ ఇంకా ఇంకా రణరంగంలోకి దూకలేదు. ఆయన దూకితే పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు. టిడిపి, వైసిపిలకు మద్దతులో రెండు శాతం తేడా ఉంది. బిజెపికి, జనసేనకు అంతే తేడా ఉంది. అంటే చంద్రబాబుపై ప్రజలు సంతృప్తిగా లేరని చెబుతున్న విపక్షాల సర్వేలోనే పోటాపోటీ పరిస్థితి ఉంది. అదే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు. వైసిపి బిజెపికి దగ్గరై, టిడిపి కమలానికి దూరమైతే.. పవన్ కళ్యాణ్‌తో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా జత కలిసే అవకాశాలు ఉన్నాయి.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications