ట్విస్ట్, పోటీకి నో: పొట్లూరిని పవన్ బుజ్జగిస్తున్నారా?
హైదరాబాద్: పోటీ పైన తొందరపడవద్దని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని, దానికి మద్దతు తెలపాలని పొట్లూరి వర ప్రసాద్.. పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తనకు మద్దతివ్వాలని కోరేందుకు పవన్‌తో పొట్లూరి గురువారం భేటీ అయ్యారు. ఈ సమయంలో పోటీ నుండి తప్పుకోవాలని నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. పోటీపై తొందర పడవద్దని సూచించి ఉండవచ్చునని అంటున్నారు.

పొట్లూరిని విజయవాడ లోకసభ బరిలోకి దింపాలని పవన్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆయనకు టికెట్ కోసం చంద్రబాబు వద్ద పవన్ లాబీయింగ్ కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, పొట్లూరికి టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అనడంతో తాను స్వతంత్రుడిగానైనా పోటీ చేస్తానంటూ భీష్మించారు.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే ప్రశ్నేలేదని పవన్ స్పష్టం చేశారు. తాను మరి కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగుతామని, మద్దతు ప్రకటించాలని పొట్లూరి.. పవన్‌ను కోరి ఉంటారని, అంతే తప్ప పవన్ పోటీ విషయం ఆలోచించడం లేదని అంటున్నారు. పొట్లూరికి కూడా అదే విషయం చెప్పి ఉండవచ్చునంటున్నారు.
ఇప్పటికే టిడిపి, బిజెపి కూటమికి మద్దతిస్తానని చెప్పినందువల్ల ఆయన తగ్గక పోవచ్చునని అంటున్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా దిగడం అనేది పొట్లూరి ఆలోచననే కావొచ్చునంటున్నారు. అయితే, అందులో పవన్ పాత్ర ఉందా లేదా అంటే ఆయన పెదవి విప్పాల్సిందేనంటున్నారు. అభ్యర్థులను బరిలోకి దింపే విషయం ఇవాళ సాయంత్రం లేదా రేపు పవన్ ప్రకటన చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ ఏం చెబుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications