నిజంగానే జగన్ మోడీని ఒక్కమాట అనలేదా?...అందుకేనా ఆ ఎమ్మెల్యే అలా!

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షనేత జగన్ పై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ ఎపి రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ఛాలెంజ్ పై వైకాపా నేతలు స్పందించక పోవడంతో ఆయన మరింత రెచ్చిపోయి అదే సవాలును మరి కొన్ని వేదికల మీద మరింత జోరుగా విసురుతున్నారు.

ఇంతకీ వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే ఎస్వి మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ ఏమిటంటే...జగన్ గడచిన నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని ఒక్కసారైనా విమర్శించారా?...అలా విమర్శించినట్లయితే తనకు అలాంటి ఒక్క వీడియో క్లిప్పింగ్‌ చూపించినా చాలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరిన సంగతి తెలసిందే. అయితే వైసిపి నుంచి ఆ ఛాలెంజ్ కు సమాధానం రాకపోవడంతో ఈ సవాలుకు వైసిపి వద్ద జవాబు ఉందా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సవాలే!...జవాబు ఉందా?...లేదా?...

సవాలే!...జవాబు ఉందా?...లేదా?...

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సంధించిన సవాల్‌కు వైకాపా నేతల నుంచి ఇంతవరకు జవాబు రాకపోవడంతో టిడిపి నేతల్లో మరింత జోష్ పెంచింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి కేంద్రంపై ఎవరి పంథాలో వారు పోరాటం చేస్తూ...అదే క్రమంలో తమదే నిజమైన పోరాటం అంటూ ఒకరిపై మరొకరు మాటల యుద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ వేదికగా ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చేసిన సవాల్‌ మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ను తీవ్రమైన ఢిఫెన్స్ లోకి నెట్టిందని చెప్పక తప్పదు.

 మరోసారి...అదే ఛాలెంజ్!

మరోసారి...అదే ఛాలెంజ్!

అయితే కారణాలేమైనా ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ఛాలెంజ్ కు వైసిపి నేతలు స్పందిచకపోవడంతో టిడిపి నేతలకు సరైన సమయంలో సరైన అస్త్రం లభించినట్లయింది. దీన్ని బట్టే వైకాపా పోరాటం అంతా నాటకమని...టిడిపినే నిజంగా పోరాడుతోందని చెప్పేందుకు బలమైన ఆయుధం దొరికినట్లయింది. అందుకే ఈ సవాల్ చేసిన ఎస్వీ మోహన్ రెడ్డినే ఇదే ఛాలెంజ్ మళ్లీ మళ్లీ చేయమని కోరుతున్నారట. టిడిపి అభిమానుల కోరిక మేరకు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి ఇదే సవాలు ను ఎక్కడ వీలైలే అక్కడ మరింత జోష్ గా చేసేస్తున్నారట. ఇదే క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా జగన్‌కు చేసిన సవాల్‌ను మరోసారి రిపీట్‌ చేశారు.

వైసిపి...ఎందుకు స్పందించడం లేదు?

వైసిపి...ఎందుకు స్పందించడం లేదు?

కర్నూలు ఎమ్మెల్యే అంత కాన్ఫిడెంట్ గా ఏకంగా తన పదవికి రాజీనామా చేసేస్తానని ఒక్కటంటే ఒక్క క్లిప్పింగ్ చూపినా చాలంటుంటే స్పందించక పోవడం వైసిపి ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అయితే ఎస్వీ మోహన్ రెడ్డి ఛాలెంజ్ కు వైసిపి స్పందించకున్నా అంత నష్టం లేదు కానీ కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఎస్వీ మోహన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన విషయాన్ని వైసిపి గుర్తించకతప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎస్వీ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ సవాలు విసరడం, ఆ కారణంగా, అందులోని విషయం రీత్యా ఈ ఛాలెంజ్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని వారు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వైకాపా ఈ ఛాలెంజ్ స్వీకరించి అందుకు తగిన విధంగా జవాబివ్వకపోతే రాజకీయంగా కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.

 ఇంతకీ మోడీని...విమర్శించారా? లేదా?

ఇంతకీ మోడీని...విమర్శించారా? లేదా?

మరోవైపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన సవాల్‌కు రోజులు గడుస్తున్నా వైకాపా నుంచి సమాధానం రాలేదంటే ప్రధాని మోదీని జగన్‌ పల్లెత్తుమాటైనా అనలేదని అర్థమవుతోందని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో సహజంగానే ఈ వ్యాఖ్యలు ఇటు టిడిపి లోనే కాకుండా అటు వైకాపాలోను చర్చనీయాంశంగా మారాయి. కింది స్థాయి వైకాపా నేతలు, జగన్ అభిమానులు అలాంటి వీడియోలు లేవా?...ప్రధాని మోడీని జగన్ ఎన్నడూ విమర్శించలేదా?...ఆ వీడియోలు బైట పెట్టి ఎమ్మెల్యే మోహన్‌రెడ్డికి తగిన బుద్ది చెబుదాం అని పై స్థాయి వైకాపా నేతల మీద ఒకటే ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఈ విషయం వైసిపి లోనూ ప్రాధాన్యం సంతరించుకొని ఇంతకీ అసలు మోడీని జగన్ ఒక్కసారైనా విమర్శించారా లేదా అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం జరుగుతోందట...అలాంటి వీడియో ఉండి వుంటే ఈ పాటికే బైటపెట్టేవారేమో అని వారే జవాబు చెప్పుకుంటున్నారట.

ఎదురుదాడి...సరికాదు

ఎదురుదాడి...సరికాదు

ఒకవేళ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సవాల్ చేసిన విధంగా అలాంటి వీడియో ఫుటేజ్ ఉంటే వైసిపి బైటపెట్టడం ఉత్తమమని, అతడు ఫిరాయింపు ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో ఆ విషయం గురించి ఎదురుదాడికి దిగినా వైసిపికే నష్టమని...అలా చేయకుండా అతని సవాల్ కు ధీటుగా సరైన సమాధానం చెప్పడం బెటరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాకాకుండా మోహన్‌రెడ్డి సవాల్‌కు వైకాపా జవాబు చెప్పలేనప్పుడు టీడీపీ నేతలను విమర్శించే నైతికహక్కు వైకాపా అధినేతకు కానీ, ఆ పార్టీ నేతలకు కానీ ఉండదనే టీడీపీ నేతలు అభిప్రాయం సమంజసమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి లోపాయికారి ఒప్పందం ఉందన్న టిడిపి ఆరోపణలకు అత్యంత బలం చేకూర్చినట్లవుతుందని విశ్లేషిస్తున్నారు. మరి ఈ విషయమై వైసిపి ఎలా స్పందిస్తుందో మరి కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi:A challenge made by the TDP MLA SV Mohan Reddy to YCP Chief YS Jaganmohan Reddy is creating vibrations in AP politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి