బ్రహ్మ పదార్థంపై గురి పెట్టిన ఇస్రో

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో సరికొత్త ప్రయోగానికి పూనుకుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 మిషన్లు సాధించిన విజయాలతో దూకుడు మీద ఉన్న ఇస్రో.. ఎక్స్‌రే పొలారీమీటర్ శాటిలైట్‌ను నింగిలోకి పంపించనుంది. కొత్త సంవత్సరం తొలి రోజే కీలక ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ఈ ఉదయం 9:10 నిమిషాలకు ఈ శాటిలైట్‌‌ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ- సీ58 రాకెట్.. నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించడానికి ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది ఇస్రో.

ISRO all set to launch PSLV-C58 XPoSat today

ఇస్రో చరిత్రలో ఇది 60వ ప్రయోగం. ఈ రాకెట్ విజయవంతం కావాలంటూ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్.. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించారు. రాకెట్ డిజైన్‌ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు- ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారినీ దర్శించుకున్నారు.

ISRO all set to launch PSLV-C58 XPoSat today

అంతుచిక్కని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఈ రెండింటిపైనా అధ్యయనం చేయడానికి పూనుకున్న రెండో దేశం.. భారత్. బ్లాక్ హోల్స్‌, న్యూట్రాన్ నక్షత్రాలపై అధ్యయనం చేయడానికి ఇదివరకు అమెరికా శాటిలైట్‌ను పంపించింది.

ISRO all set to launch PSLV-C58 XPoSat today

బ్లాక్ హోల్స్ నుంచి వెలువడే రేడియేషన్లను గుర్తించడం, అంతరిక్షంలో వారి కదలికలను పసిగట్టడం, ఇతరత్రా అంశాలపై డేటాను సేకరిస్తుంది ఈ శాటిలైట్. ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహంతో పాటు పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్‌ను కూడా పేలోడ్‌గా అంతరిక్షంలోకి పంపించనుంది ఇస్రో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+