చంద్రబాబుతో గుసగుస: గవర్నర్ నోట పవన్ కళ్యాణ్ సినిమా(ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి హైకోర్టు విభజన అంశం వివాదంగా మారడంతో కేంద్రం ఆదేశాలతో సమస్య పరిష్కారం కోసం ప్రోటోకాల్‌ను పక్కకు బెట్టి గవర్నర్ నరసింహాన్ గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యేందుకు విజయవాడకు వెళ్లిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి చంద్రబాబుతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, సమస్య పరిష్కారమవుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రానికల్లా తిరుమల చేరుకున్న ఆయన, శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన అంశం గురించి మీడియా అడిగినప్పుడు, 'దేవుడే చూసుకుంటాడంటూ' ఆయన దైవంపై భారం వేస్తూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంతక ముందు వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాక్‌లో ఏర్పాటైన మంత్రుల చాంబర్లను గురువారం ముఖ్యమంత్రితో కలిసి గవర్నర్‌ పరిశీలించిన సంగతి తెలిసిందే.

గురువారం సాయంత్రానికి ఆయన తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఆలయ జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ నరసింహన్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గురువారం రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేస్తారు. శుక్రవారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభం దర్శనంలో శ్రీవారిని నరసింహన్ దర్శించుకున్నారు.

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

అంతక ముందు అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో తాను కూడా ఉంటానని గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. నూతన సచివాలయంలో తనకు కూడా స్థానం కావాలని సీఎం చంద్రబాబును అడిగానన్నారు. తాత్కాలిక సచివాలయ విశేషాలను చంద్రబాబు దగ్గరుండి గవర్నర్‌కు వివరించారు.

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. సచివాలయ నిర్మాణం ఆధునికంగా ఉందని, మంచి సౌకర్యాలు ఉన్నాయని గవర్నర్‌ కితాబిచ్చారు. ‘‘మనం కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. క్రమంగా అవే సర్దుకుంటాయి. ఉద్యోగులంతా ఇదే స్ఫూర్తితో ఉండాలి. మన రాష్ట్రం అనే భావనతో అమరావతిలో పనిచేయాలి. ఉద్యోగులు సుఖంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. ఆ బాధ్యతను మేము తీసుకుంటాం'' అని గవర్నర్‌ భరోసా ఇచ్చారు.

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

హైదరాబాద్‌ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారని... భవిష్యత్తులో తాత్కాలిక సచివాలయం నుంచి అమరావతిలో అసలు సచివాలయానికి వెళ్లేప్పుడూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని తాను అన్నానని నవ్వుతూ చెప్పారు.

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

తాను తెలంగాణలోనే ఉంటున్నానన్న ఆరోపణలను గవర్నర్‌ కొట్టివేశారు. ఏపీలో నీరు-చెట్టు కార్యక్రమం ప్రారంభోత్సవానికి అనంతపురం జిల్లా వెళ్లానని, సభాపతుల సదస్సుకు వచ్చానని గుర్తు చేశారు. గవర్నర్‌ నేరుగా సచివాలయానికి రావొచ్చా? అని ఒక విలేకరి ప్రశ్నించగా..

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

‘‘తెలుగులో అత్తారింటికి దారేది అని సినిమా వచ్చింది. అలాగే అత్తారింటికి దారి చూపించడం తప్పా? వస్తే వచ్చానంటారు. రాకపోతే తెలంగాణలోనే ఉన్నానంటారు'' అని నరసింహన్‌ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు 24గంటలూ కష్టపడుతున్నా కేంద్రం తగిన సాయం చేయడం లేదని, గవర్నర్‌గా మీరు కూడా ఏ పాత్రా పోషించడం లేదని అడగ్గా... ‘‘నేను చేస్తున్న సాయం మీకు కనిపించకపోవడమే మంచిది. కనిపిస్తే మిస్చీఫ్‌ చేస్తారు'' అని అన్నారు.

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. అయితే... అన్నీ పరిష్కారమైపోతే పాత్రికేయుల్లో చాలామందికి ఉద్యోగాలు ఉండవని చమత్కరించారు. తొలిసారి సచివాలయ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన గవర్నర్‌కు మనస్ఫూర్తిగా స్వాగతం పలికామని చంద్రబాబు తెలిపారు.

 ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఏం చేద్దాం: బాబు భుజంపై చెయ్యేసి చెవిలో గవర్నర్ గుసగుస

ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో శాశ్వత ప్రభుత్వ భవనాలు నిర్మించి తర్వాత తాత్కాలిక సచివాలయాన్ని అక్కడికి తరలిస్తామన్నారు. విభజన అనంతరం పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. గవర్నర్‌ ఇచ్చే సూచనలు, సలహాలను తీసుకుంటూ ముందుకెళ్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Governor E S L Narasimhan on Thursday said all issues (that remained contentious) between Andhra Pradesh and Telangana are being addressed and assured solutions would be worked out.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X