దేవుడే కాపాడాలి: మంత్రి స్కూల్ కు ర్యాంకులు వచ్చాక స్పందిస్తారా, జగన్ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుబట్టారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అధికార పార్టీ పదే పదే అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ లో జరగుతున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంపైనే ఆయన ప్రస్తావించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.

సీబీఐ విచారణ చేస్తే అన్ని విషయాలు తేలుతాయి

సీబీఐ విచారణ చేస్తే అన్ని విషయాలు తేలుతాయి

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహరంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని వైసిపి అధినేత జగన్ అభిప్రాయపడుతున్నారు. ఆరున్నరలక్షల కుటుంబాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వానికి లెక్కలేని తనం కన్పిస్తోందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు

తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు

ప్రశ్నపత్రాల లీకేజీలో తప్పును కప్పిపుచ్చేందుకుగాను ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తప్పులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొనే విషయమై ముఖ్యమంత్రి మాత్రం ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆరోపించారు.ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంలో తప్పు జరిగిందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒప్పుకొన్నాడని ఆయన చెప్పారు. అటెండర్ ఫోన్ ద్వారా పేపర్ లీకైందని ఆయన ఢిల్లీలో ప్రకటించారని చెప్పారు.

ఆ కాలేజీ ఎవరిదో అందరికీ తెలుసు

ఆ కాలేజీ ఎవరిదో అందరికీ తెలుసు

ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందినవాడో అందరికీ తెలుసు. ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్ఐఆర్ కాపీయే చెబుతోంది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రశ్నపత్రాలు లీక్ చేసే కష్టపడి చదివిన విద్యార్థులకు కనీసం వందవ ర్యాంకైనా వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంత్రి స్కూలే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి

మంత్రి స్కూలే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి

చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ అని చెబుతారని చెప్పారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకు వాటాలున్నాయని పుకార్లు కూడ ఉన్నాయని జగన్ చెప్పారు. స్కామ్ జరిగిన కాలేజీ ఒక మంత్రికి చెందింది.మరొక మంత్రి ఆయన వియ్యంకుడు.ఇది చాలదా ఈ కేసు ఎంత బాగా నడుస్తోంది అని చెప్పడానికి చిన్న చిన్న అధికారులపైనో, అటెండర్ లపైనో కేసును నెట్టివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

నారాయణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చాక స్పందిస్తారా?

నారాయణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చాక స్పందిస్తారా?

ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబునాయుడు ఎప్పుడో దీనిపై స్పందిస్తారో అర్థం కావడం లేదన్నారు జగన్.రోమ్ తగలబడుతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా చంద్రబాబు వ్యవహరం ఉందన్నారు. బహుశా కాపీలు కొట్టిన నారాయణ విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు వచ్చాక స్పందిస్తారోమోనని ఆయన ఎద్దేవా చేశారు.

విద్యావ్యవస్థను కుప్పకూల్చారు

విద్యావ్యవస్థను కుప్పకూల్చారు

మంత్రి నారాయణ కారణంగా విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్ జగన్ ఆరోపించారు. నారాయణ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. తాము ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని ప్రశ్నపత్రాలు లీక్ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్ బిల్లును ఆమోదించారని చెప్పారు.

ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంభిస్తోంది

ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంభిస్తోంది

ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని చెప్పారు. ఏ విషయమైనా దాటవేత ధోరణిని అవలంభిస్తోందన్నారు. తాము అన్ని ఆధారాలు చూపించినా ప్రభుత్వం స్పందిచడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైఎస్ జగన్ చెప్పారు.

రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి

రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి

రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాము లేవనెత్తిన ఏ అంశానికి కూడ సక్రమంగా సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు.అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
jagan demanded to governament enquiry with cbi on question papers leakage on tuesday. after assembly adjourned ysrcp chief jagan chit chat with media .
Please Wait while comments are loading...