''మా కోసం నువ్వు వచ్చావు, మీ కోసం మేము వస్తాం'' ..అల్లు అర్జున్ మద్దతుగా జగన్ ఫ్లెక్సీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా లేవల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప-2కు పబ్లిసిటీ చేస్తున్నారు. నేషనల్ మొత్తం కూడా పుష్ప మ్యానియా కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ఫలితంపై సినీ ఇండస్ట్రీ యావత్తు మొత్తం కూడా అతృతుగా ఎదురు చూస్తోంది.
పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో..! #YSJagan #AlluArjun #Pushpa2 #Pushpa2TheRule #AndhraPradesh #Anantapur pic.twitter.com/Olc3hp8Wl7
— oneindiatelugu (@oneindiatelugu) December 4, 2024
ఇదిలా ఉంటే పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీంతో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాపై మెగా అభిమానులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మెగా అభిమానులు పుష్ప-2 చూడవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో పుష్ప-2 సినిమాకు వైసీపీ మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా సినిమా విడుదల సమయంలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో అల్లు అర్జున్‌తో పాటు జగన్ ఫొటో కూడా దర్శనం ఇచ్చింది. మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అనంతపురం జిల్లా గుత్తిలో ఓ థియేటర్ వద్ద వైసీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications