Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతు రుణ‌మాఫీ వైపు జ‌గ‌న్ చూపు : ప‌రిమితి పైనే తుది క‌స‌ర‌త్తు : టిడిపి ఎత్తుల‌కు చెక్ పెట్టేలా..!

ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌రి కొత్త హామీ. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు కొత్త ఎత్తుగ‌డ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన వ‌రాలు ఒక ఎత్తు.. పార్టీ మేనిఫెస్టో విడుద‌ల వేళ సంచ‌ల‌న హామీ ఇవ్వ‌నున్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. ఉగాది ప‌ర్వ‌దినం నాడే టిడిపి..వైసిపి లు త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలు విడుద‌ల చేస్తున్నాయి. వైసిపి ప్ర‌కటించబోయే ఈ కొత్త హామీ పై తుది క‌స‌ర‌త్తు జ‌రుగు తోంది. వైసిపి హామీల ను చూసి ..ధీటుగా తాము హామీలు గుప్పించేందుకు టిడిపి సిద్ద‌మైంది.

వైసిపి మేనిఫెస్టోలో రుణ మాఫీ....!

వైసిపి మేనిఫెస్టోలో రుణ మాఫీ....!

ఈ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైసిపి అధినేత జ‌గ‌న్ ఉగాది నాడు పార్టీ మేనిఫెస్టో విడుద‌ల కు ము హూర్తం నిర్ణ‌యించారు. అందులో భాగంగా విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నా రు. ఇక‌, ఇప్ప‌టికే న‌వ ర‌త్నాల ద్వారా రెండేళ్ల‌కు పైగా వైసిపి ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. అధికారంలోకి వ‌స్తే న‌వ ర‌త్నాల హామీ ల అమ లు ద్వారా ప్ర‌తీ ఒక్క‌రికి మేలు చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌తీ స‌భ‌లో చెబుతున్నారు. ఇక‌, ఇప్ప‌టికే రైతుల‌కు ఏడాదికి 12,500 చొప్పున పంటా సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌టితో ఆగ‌కుండా..రైతు రుణ మాఫీ పై జ‌గ‌న్ కీల‌క నిర్ణ యం తీసుకు న్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. అందులో భాగంగా..2014 ఎన్నిక‌ల్లో సాధ్యం కాద‌ని చెప్పిన రైతు రుణ మాఫీ దిశ‌గా త‌న పార్టీ మేనిఫెస్టోలో నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా టిడిపిని పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టాల‌న‌దే జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

టిడిపి ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ పెట్టేందుకు.

టిడిపి ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ పెట్టేందుకు.

టిడిపి ఎన్నిక‌ల పోలింగ్ ముందు ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పెన్ష‌న్ల తో పాటుగా అన్న‌దాత సుఖీభ‌వ‌..డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప‌సుపు- కుంకుమ‌.. రైతు రుణ మాఫీ 4,5 విడ త‌ల్లో చెల్లించాల్సిన మొత్తం న‌గ‌దు ను స‌రిగ్గా పోలింగ్ ముందు ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ అయ్యేలా ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్ష‌న్లు..అన్న‌దాత సుఖీభవ నిధులు ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ అయ్యాయి. ఈ రోజు లేదా రేపు ప‌సుపు - కుంకుమ , రైతు రుణ విముక్తి నిధులు ఈ నెల 8వ తేదీ నాటికి విడుద‌ల అవుతాయ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో పోలింగ్ ముందు ఓట‌ర్లు ప్ర‌భావితం అవుతార‌ని..త‌మ‌కు రాజ‌కీయంగా మేలు జ‌రుగుతుంద‌ని టిడిపి అంచ‌నా వేస్తోంది. దీనికి కౌంట‌ర్ గా వైసిపి ఇప్పుడు రుణ‌మాపీ ప్ర‌క‌ట‌న ద్వారా ట‌డిపికి చెక్ పెట్టాల‌నేది వైసిపి వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న క‌లిసొస్తుందా...

రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న క‌లిసొస్తుందా...

వైసిపి రుణ‌మాఫీ చేస్తే ఎన్నిక‌ల్లో ఏ మేర క‌లిసి వ‌స్తుంద‌నే చ‌ర్చ వైసిపి తో పాటుగా టిడిపిలో నూ చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి సంపూర్ణ రుణ మాఫీ ప్ర‌క‌టిస్తే..జ‌గన్ అది సాధ్యం కాద‌ని ప్ర‌చారం చేసారు. అదే స‌మ‌dజ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్నారు. దీని ద్వారా..తాను ఇచ్చే హామీల‌ను విశ్వ‌స‌రిస్తార‌నేది జ‌గ‌న్ ధీమా గా క‌నిపిస్తోంది. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ రుణ మాఫీ ప్ర‌క‌టిస్తే ప‌రిమితి ఎంత పెడ‌తారు..ఏ విధంగా అమ‌లు చేస్తార‌నేది వివ‌రించాల్సి ఉంటుంది. దీంతో..జ‌గ‌న్ విడుద‌ల చేసే మేనిఫెస్టో పై ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఇక‌, జ‌గ‌న్ మేనిఫెస్టో కు ధీటుగా టిడిపి మేనిఫెస్టో ఎలా ఉంటుంనేదీ ఆస‌క్తి క‌ర‌మే..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+