Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జ‌గ‌న్ కేబినెట్‌లో డిప్యూటీలు ఉంటారా: హోం మంత్రిగా మ‌హిళ‌కే : వైయ‌స్ త‌ర‌హాలోనే..!

మ‌రి కొద్ది గంట‌ల్లో జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రుంటారో తేలిపోనుంది. ఇదే స‌మ‌యంలో ఆశావాహుల‌తో పాటుగా అందరిలో నూ మంత్రులు ఎవ‌రు..ఉప ముఖ్య‌మంత్రులు ఉంటారా..హోం శాఖ ఎవ‌రికి ఇస్తారు..ఇలా అనేక ప్ర‌శ్న‌లు మొద‌ల య్యాయి. అయితే, జ‌గ‌న్ మాత్రం త‌న కేబినెట్‌లో విల‌క్ష‌ణ నిర్ణ‌యాలు తీసుకొనే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. సాధార ణ తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స‌మ‌ర్ధ‌త‌..విధేయ‌త‌..స‌మ‌తుల్య‌త ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకుంటు న్నారు. దీనికి సంబంధించి తుది క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌రి..జ‌గ‌న్ తీసుకొనే కీల‌క నిర్ణ‌యాలు ఏంటి..

ఉప ముఖ్య‌మంత్రులు ఉంటారా..

ఉప ముఖ్య‌మంత్రులు ఉంటారా..

జ‌గ‌న్ కేబినెట్‌లో ఉప ముఖ్య‌మంత్రులు ఉంటారా. వ‌య‌స్సు చిన్న‌ది బాధ్య‌త పెద్ద‌ది అని జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం నాడే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ మాత్రం ఆ బాధ్య‌త పూర్తి స్థాయిలో నిర్వ‌ర్తించ‌టానికి సిద్దంగా ఉన్నారు. అందులో భాగంగా త‌న కేబినెట్‌లో ఆరుగురు సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారులుగా పాల‌నా ప‌రంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ఎంచుకుంటున్నారు. ఇక‌, కేబినెట్‌లో డిప్యూటీ మంత్రులు ఉంటార‌ని..వారి పేర్లు ఇవేనంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, జ‌గ‌న్ ఎక్క‌డా ఎప్పుడూ తాను ఉప ముఖ్య‌మంత్రులను తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించ లేదు. టీడీపీ అసం అధినేత చంద్ర‌బాబు గ‌త ప్ర‌భు త్వంలో బీసీ-కాపు వ‌ర్గాల‌కు చెందిన వారికి ఉప ముఖ్య‌మంత్రులుగా అవ‌కాశం ఇచ్చారు. ఈ సారి అధికారంలోకి వ‌స్తే ముస్లిం..మైనార్టీ వ‌ర్గానికి చెందిన వారిని డిప్యూటీ సీఎం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ విష‌యంలో మాత్రం అటు వంటి హామీలు లేక‌పోవ‌టంతో.. ఉప ముఖ్య‌మంత్రుల ప్ర‌స్తావ‌న ఉండ‌ద‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

హోం ప‌గ్గాలు మ‌హిళ‌కేనా..

హోం ప‌గ్గాలు మ‌హిళ‌కేనా..

జ‌గ‌న్ తాను అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నానే బ‌ల‌మైన సంకేతాలు ఇచ్చే క్ర‌మంలో భాగంగా..కీల‌క‌మైన హోం శాఖ‌ను మ‌హిళకు ఇవ్వ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో రోజాకు హోం శాఖ ఇస్తార‌నే ప్ర‌చారం సాగింది. అయితే, సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా..అది సాధ్య‌ప‌డేలా లేదు. దీంతో..జ‌గ‌న్ కేబినెట్‌లో ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వీరిలో ఒక‌రికి హోం శాఖ క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది. దీని ద్వారా రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత హోం శాఖ మ‌హిళ‌కు ఇచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్‌కు ద‌క్కుతుంది . దీని కోసం ఆయ‌న కేబినెట్‌లో తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన ముగ్గురు మ‌హిళ‌ల్లో ఎవ‌రికి ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడుతార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. అది కూడా ఎస్సీ లేదా ఎస్టీ మ‌హిళ‌కు ఆ ప‌ద‌వి ఇస్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నట్లే..

తండ్రి బాట‌లోనే జ‌గ‌న్‌..

తండ్రి బాట‌లోనే జ‌గ‌న్‌..

ఉప ముఖ్య‌మంత్రులు లేకుండా..మ‌హిళ‌కే హోం మంత్రి ఇవ్వ‌టం ద్వారా తాను త‌న తండ్రి అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తున్నానే సంకేతాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వైయ‌స్ 2009లో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌బితా ఇంద్రారెడ్డికి హోం శాఖ ఇచ్చారు. అది అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అదే స‌మ‌యంలో కేవీపీ రామ‌చంద్ర‌రావు భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిగా వైయ‌స్ ప్ర‌భుత్వంలో ఉండేవారు. ఇక‌, ప్ర‌ధాని మోదీ సైతం గ‌త కేబినెట్‌లో కీల‌క మైన ర‌క్ష‌ణ శాఖ‌ను నిర్మలా సీతారామ‌న్‌కు ఇవ్వ‌గా..ఈ సారి ఆర్దిక శాఖ అప్ప‌గించారు. దీంతో..జ‌గ‌న్ సైతం త‌న కేబినెట్‌లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త‌..కీల‌క పోర్టుఫోలియోలు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+