విభజన: ఉద్యోగులపై జైరాం ట్విస్ట్, గుద్దితే: చంద్రబాబు

హైదరాబాద్: ఉద్యోగుల విషయంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గురువారం షాక్ ఇచ్చారు. ఉద్యోగుల విషయంలో ఆప్షన్స్ పరిశీలన మాత్రమేనని, ఫైనల్ కాదని జైరాం చెప్పారు. ఆయన ఉద్యోగ సంఘాలతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు ఆయనను నిలదీశాయి.

తాము ఎట్టి పరిస్థితుల్లోను ఆప్షన్లు అంగీకరించమని తేల్చి చెప్పాయి. తెలంగాణ అపాయింటెండ్ తేదీ అయిన జూన్ 2 వరకు ప్రమోషన్లు, రిక్రూట్మెంట్లు ఆపేయాలని వారు కోరారు. దీనిపై జైరాం స్పందించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పారు.

Jairam twist on Employees

ఆప్షన్లు పరిశీలన మాత్రమేనని, ఫైనల్ మాత్రం కాదన్నారు. ఉద్యోగుల విరమణ వయస్సు తాము అరవయ్యేళ్లకు పెంచుతామన్నారు. వారం రోజులలో ప్రొనిజినల్ గైడ్ లైన్స్ ఉంటాయన్నారు. పదివేల మంది జూనియర్ లైన్ మెన్లను క్రమబద్ధీకరిస్తామని ఆయన చెప్పారు. సుస్థిర ప్రభుత్వం రావాలని, తమదే తొలి ప్రభుత్వం అన్నారు.

కెసిఆర్‌పై చంద్రబాబు నిప్పులు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మండిపడ్డారు. కెసిఆర్ గురువుకే పంగనామాలు పెట్టారని, ఆయనకు అధికారమిస్తే దోచుకుంటారన్నారు. తన సైకిల్‌కు స్పీడ్ ఎక్కువని, గుద్దితే గాల్లో తేలిపోతారన్నారు. జగన్‌కు అదికారమిస్తే రెండు రాష్ట్రాల్లో దోచుకుంటారని ఆరోపించారు. తెలంగాణలో టిడిపి, బిజెపి కూటమిని గెలిపిస్తే భద్రాచలాన్ని తిరుపతిలా చేస్తానన్నారు. జగన్ వైయస్ కంటే పెద్ద గజదొంగ అన్నారు. ఆయన ఖమ్మం జిల్లాలో మాట్లాడారు.

కెసిఆర్ దెబ్బకు: బాబుపై హరీష్

తెరాస నేత హరీష్ రావు గజ్వెల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల అనంతరం తెలంగాణలో ఎన్టీఆర్ భవన్‌కు టులెట్ బోర్డు తప్పదన్నారు. బాబుతో జతకట్టినందునే మోడీ సభకు జనాలు రావడం లేదన్నారు. తెరాసను చిత్తుగా ఓడిస్తానన్న బాబు పదేళ్ల క్రితం కెసిఆర్ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+