Chiranjeevi: తండ్రిలా పెంచారు..అన్నయ్యకు ఫస్ట్ ఫ్యాన్ నేనే: పవన్ కల్యాణ్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు. హ్యాపిీ బర్త్‌డే మెగాస్టార్ అంటూ గ్రీటింగ్ చెబుతోన్నారు. బర్త్‌డే విషెస్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. చిరంజీవి అనే పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. చిరంజీవి సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా కోట్లాదిమంది అభిమానుల్లో ఒకరిగా నిలిచారు. తన అన్నకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.

చిరంజీవి తనకే కాదు ఎందరికో మార్గదర్శి అని, మరెందరికో స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆయన గురించి ఎంత చెప్పుకొన్నా కొన్ని మిగిలే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆయనకు తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమని అన్నారు. చిరంజీవిలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమని చెప్పారు.అన్నయ్యను ఆరాధించే లక్షలాదిమందిలో తాను తొలి స్థానంలో ఉంటానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. చిరంజీవిని, ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని, ఉన్నతిని కళ్లారా వీక్షించానని వ్యాఖ్యానించారు.

Jana Sena Chief Pawan Kalyan extend warm wishes to his brother and Mega Star Chiranjeevi

అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడని చిరంజీవిని కీర్తించారు పవన్ కల్యాణ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనలోనే అద్భుత లక్షణమని, భారతీయ సినీ యవనికపై తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ..గర్వాన్ని ప్రదర్శించలేదని అన్నారు. పద్మభూషణ్ అవార్డు, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పదవులు అందుకున్నా ఎక్కడా తల ఎగరవేయలని చెప్పారు. చిరంజీవిని లక్షలాది కుటుంబాలు తమ సొంత కుటుంబీకుడిగా భావించడానికి అదే ప్రధాన కారణమని అన్నారు.

Recommended Video

    తాలిబన్లపై PM Modi కీలక వ్యాఖ్యలు..! || Oneindia Telugu

    విద్యార్థిదశలోనే సేవాభావజాలాన్ని ఆయన ఆర్జించుకున్నారని, అత్యున్నత శిఖరాలను అందుకున్న తరువాత కూడా దాన్ని కొనసాగిస్తోన్నారని వ్యాఖ్యానించారు. బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారని చెప్పారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారని పేర్కొన్నారు. కరోనా సమయంలో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలిని తీర్చడానికి చిరంజీవి ఎంతో తపన పడ్డారని అన్నారు. అన్నగా జన్మించినా.. తండ్రిలా పెంచారని కొనియాడారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+