అంకెల గారెడీ.!అభూత కల్పన.!వైసిపి బడ్జెట్ పై జనసేన అసంతృప్తి.!

అమరావతి/హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, అభూత కల్పన మాత్రమేనని, పేద,సామాన్య, మధ్యతరగతి ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారని జనసేన పార్టీ అసహనం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వాస్తవిక దృష్టితో ప్రజల బాధలు తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని, కాని నేటి బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం ప్రతిఫలించలేదని ఆవేదన వ్యక్తం చేసారు నాదెండ్ల మనోహర్.

కరోనా తీవ్రతను వైసీపి గుర్తించ లేదు.. అందుకే బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులన్న పవన్ కళ్యాణ్..

కరోనా తీవ్రతను వైసీపి గుర్తించ లేదు.. అందుకే బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులన్న పవన్ కళ్యాణ్..


ఏపి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జనసేన పెదవి విరుస్తోంది. 2.29 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంకెల హంగామా తప్ప రాష్ట్ర అభివృద్ధి దోహదపడేది కాదని జనసేన అభిప్రాయపడింది.ముఖ్యంగా వైద్య రంగం మౌలిక వసతుల కల్పన, ప్రజారోగ్యంపై దృష్టి సారించలేదని విమర్శించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అభూత కల్పనలు, ఆత్మస్తుతితో సాగిందని, ప్రజలు తమ ప్రాణాలు కాపాడమని రోధిస్తుంటే, శాసన సభలో ముఖ్యమంత్రిని పొగిడేందుకు కొటేషన్లు, పద్యాలు చదువుకొంటూ మభ్యపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు నాదెండ్ల మనోహర్.

కరోనా క్లిష్ట సమయం.. ఆరోగ్య శాఖకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సిందన్న జనసేన..

కరోనా క్లిష్ట సమయం.. ఆరోగ్య శాఖకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సిందన్న జనసేన..


కరోనా నియంత్రణకు కేటాయించిన మొత్తాలు చూస్తేనే కరోనా కట్టడికి వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం అవుతోందని ఎద్దేవా చేసారు జనసేన నేతలు. కరోనా నియంత్రణకు కేవలం వెయ్యి కోట్ల రూపాలను ప్రతిపాదించి సరిపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆరోగ్య విపత్తులో చిక్కుకొని ఉందని, థర్డ్ వేవ్ ముప్పు కూడా ఈ ఏడాదిలోనే ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన కూడా ఈ పాలకులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి, కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై కార్యచరణ రూపొందించాలని జనసేన డిమాండ్ చేసింది.

ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో ఆదర్శంమన్న వైసీపి.. మరి సీఎం ఎందుకు సందర్శించడం లేదన్న జేఎస్..

ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో ఆదర్శంమన్న వైసీపి.. మరి సీఎం ఎందుకు సందర్శించడం లేదన్న జేఎస్..


కరోనా నియంత్రణలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా చేసుకున్నామని చెప్పి సొందడబ్బా కొట్టుకుంటున్నారని, ఇంతకంటే హాస్యాస్పదమైన ప్రకటన మరొకటి ఉండదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి తన ఇంటి నుంచి బయటకు కదిలి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే కరోనా బాధితుల వేదన, ప్రజల భయాందోళనలు అర్థం అవుతాయని, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయని, సీఎం చెప్తున్నట్టు అంత ఆదర్శవంతమైన సేవలు ఇస్తుంటే రోగులు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడం లేదో ముఖ్యమంత్రే స్పష్టం చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఇన్ని వనరులుంటే ఆస్తులు అమ్ముకోవడం ఎందుకు.? సూటిగా ప్రశ్నించిన జనసేన..

ఇన్ని వనరులుంటే ఆస్తులు అమ్ముకోవడం ఎందుకు.? సూటిగా ప్రశ్నించిన జనసేన..


మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు తప్ప వాటిని విడుదల చేసి పనులు చేపడుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని మనోహర్ మండిపడ్డారు. రహదారుల, రవాణా కోసం 7 వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్టు చెప్పుకుంటున్నారని, గత బడ్జెట్లోనూ 6,200 కోట్లు నిధులు ఇచ్చారని, రాష్ట్రంలో ఎక్కడైనా రహదారులను అభివృద్ధి చేశారా? గుంతలు పూడ్చేందుకు తట్టెడు మట్టి అయినా పోశారా? అని మనోహర్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో ఇచ్చే నిధులు నీటి మీద రాతల్లా వైసీపి ప్రభుత్వం మార్చేసిందని అన్నారు. సంక్షేమ బడ్జెట్ 32 శాతం పెంచాం అంటూ ఓ అభూత కల్పనతో హడావిడి చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమగ్ర అభివృద్ధి విషయాన్ని పక్కకు నెట్టేసారని జనసేన మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+