మాజీ జేడీ మేధావి కాదు..మంచోడు కాదు - జనసేన నేత సంచలనం...!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పైన జనసేన నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌ లాంటి వాళ్లు కాపు నాయకులే కాదంటూ జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. గోదావరి జిల్లాల్లో తామే ఏ పార్టీకి అయినా టికెట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నామని చెప్పారు. లక్ష్మీనారాయణ మేధావి కాదని..మంచోడు కాదంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అక్కడ మేమే సీట్లిస్తాం
గోదావరి జిల్లాల్లో జనసేన బలం గురించి ఒక టీవీ చర్చలో ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యానారయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సొంత డబ్బుతో రైతులకు పవన్ సాయం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యల పైన దుమారం మొదలైంది. గతంలో ఫార్మా సంస్థల అధిపతులు, ఎన్నారైలు, అభిమానుల నుంచి నిధుల గురించి ఆప్ తరహాలో పారదర్శకంగా ప్రకటన చేయాలని సూచించిన కాపు నేతలు ఆ తరువాత పార్టీలో లేకుండా చేసారంటూ వచ్చిన వ్యాఖ్యలతో బొలిశెట్టి సీరియస్ గా స్పందించారు.

Janasena

అసలు వాళ్లంతా కాపులే కాదని వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అయినా తామే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నామంటూ బొలిశెట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ గురించి కీలక అంశాలను ప్రస్తావించారు.

మాజీ జేడీ మేధావి కాదు
మాజీ జేడీ లక్ష్మీనారాయణకు తానే టికెట్ ఇచ్చానని బొలిశెట్టి చెప్పుకొచ్చారు. లక్ష్మీనారాయణ అందరూ అనుకున్నట్లుగా మేధావి కాదన్నారు. మంచోడు కాదని వ్యాఖ్యానించారు. పార్టీ వదిలి ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. కడప..కర్నూలులో పుట్టిన వ్యక్తి విశాఖలో పోటీకి సిద్దం అవ్వటం ఏంటని వ్యాఖ్యానించారు.

పవన్ లేకుండా పైసాకు పనికిరారని ఘాటు విమర్శలు చేసారు. వీళ్లు కాపు నేతలా అని ప్రశ్నించిన బొలిశెట్టి... కాపు నేతలైతే పవన్ ఎలా అధికారంలోకి వస్తారో చూడాలని చెప్పుకొచ్చారు. గ్రామాలు..స్వరాజ్యం అని చెప్పుకొనే నేతలు వేరే ప్రాంతాలకు వెళ్లి పోటీ చేయటం ఏంటంటూ లక్ష్మీనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Janasena

విశాఖ నుంచి బరిలో
గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓడిన తరువాత పార్టీ వీడారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే ప్రకటించారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

అవసరమైతే స్వంతంత్ర అభ్యర్ధిగా పోటీకి సిద్దమని స్పష్టం చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ పైన జనసేన నేత ఓపెన్ చర్చలో చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారుతున్నాయి. వీటి పైన లక్ష్మీనారాయణ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+