వైసీపీని తొక్కేసిన పవన్ - 21/21, 2/2, నయా రికార్డు..!!
ఏపీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. విజయం పై ఖాయంగా కనిపించిన వైసీపీ అడ్రస్ గల్లంతు అయింది. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అంచనాలకు మించి విజయం దిశగా వెల్తోంది. సర్వే సంస్థల అంచనాలు తల కిందులయ్యాయి. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పరాజయం వెనుక పవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ తాడేపల్లిగూడెం సభలో చెప్పినట్లుగానే పూర్తిగా తొక్కేసినట్లు కనిపిస్తోంది.
కూటమి ఘన విజయం
టీడీపీ కూటమి ఏపీలో ఏకపక్ష విజయం సాధిస్తోంది. పూర్తిగా ఎన్నిక ఒకే వైపు జరిగినట్లు స్పష్టం అవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చిన తీర్పు తరహాలోనే ఇప్పుడు టీడీపీ కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే, కూటమి గెలుపు పైన జనసేన ప్రభావం బలంగా కనిపిస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు జనసేన పోటీ చేసిన అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లోనూ జనసేన గెలుపు దిశగా వెళ్తోంది. ఇది ఏపీ రాజకీయాల్లో కొత్త రికార్డు.

పవన్ చెప్పిన విధంగా
ఏపీలో వైసీపీ పరాజయం ఖామైంది. ఊహించని ఓటమి మూటగట్టుకుంది. జనసేనాని పవన్ ఈ సారి ఎలాగైనా జగన్ ను ఓడిస్తానని శపథం చేసారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్ ను ఓడించటం లో పవన్ కీలక పాత్ర పోషించారు. అదే విధంగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ 21 సీట్లలో పోటీ చయటం పైన తొలుత పలు విమర్శలు వచ్చాయి. అయితే, ఎన్ని సీట్లలో పోటీ చేసినా వంద శాతం స్ట్రైకింగ్ రేట్ ఉండాలని పవన్ పార్టీ కేడర్ కు సూచించారు. చెప్పినట్లుగానే 100 శాతం స్ట్రైకింగ్ రేట్ తో పవన్ విజయం సాధించారు.
గెలుపు వెనుక పవన్
కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన గెలుపు దిశగా ముందుకు వెళ్తోంది. దీంతో..ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో..కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. పవన్ కు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోదీ మూడో సారి ప్రధాని కావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications