అసెంబ్లీలో ఎవరికీ అనుమతి లేదు: నాగబాబు ఎలా వచ్చాడు?: అన్ అఫీషియల్ వీడియో పోస్ట్

Nagababu: ఏపీ అసెంబ్లీ మొదలయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 9:45 నిమిషాలకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తోన్నారు.

శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేశారు.

Janasena leader Nagababus Presence in Assembly Gallery Stirs Controversy Over Access regulations

నిజానికి- ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయటి వ్యక్తులకు ఎవరికీ అనుమతి లేదు. పార్టీ నాయకులకు గానీ, సందర్శకులకు గానీ ప్రస్తుతానికి అనుమతి ఇవ్వట్లేదు. దీనికి సంబంధించిన ఎలాంటి పాసులు జారీ చేయలేదు అసెంబ్లీ సెక్రెటేరియట్. మీడియాకు మాత్రమే మినహాయింపు ఉంది. అసెంబ్లీ కవరేజీ కోసం విలేకరులకు మాత్రమే పాసులు ఇచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అసెంబ్లీలో కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏకంగా గ్యాలరీలో విజిటర్స్ గ్యాలరీలో ప్రత్యక్షం అయ్యారాయన. ప్రొసీడింగ్స్ ఆరంభం నుంచీ అక్కడే గడిపారు. శాసన సభ్యుడిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇది- దుమారం రేపుతోంది. కుటుంబ సభ్యులకు గానీ, బయటి వ్యక్తులకు గానీ అసెంబ్లీకి రావడానికి అనుమతి లేనప్పుడు నాగబాబు ఎలా వచ్చారనేది లాబీల్లో హాట్ టాపిక్ అయింది. ఒకే కుటుంబం నుంచి ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు మంత్రి, ఇంకొకరు ఎమ్మెల్యేగా గా ఉన్నప్పటికీ- చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా అసెంబ్లీకి రాలేదు.

నాగబాబు మాత్ర విజిటర్స్ గ్యాలరీలో ఎంటర్ కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజిటర్స్ పాస్ ఎవరు ఇచ్చిరు?, ఎలా ఇచ్చారు? అనే విషయంపై చర్చ జరుగుతోంది. తాను గ్యాలరీలో ఉన్నప్పుడు తీసిన వీడియో క్లిప్‌ను ఎక్స్ అకౌంట్‌లో సైతం పోస్ట్ చేయడం వివాదాన్ని మరింత రాజేసినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+