టీడీపీ కూటమిని ప్రశ్నిస్తే.. అవుటే: మరో జనసేన నేతపై వేటు
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ టీవీ రామారావుపై వేటు పడింది. పార్టీ అగ్రనాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యకలాపాలను నిర్వహించడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది జనసేన. ఇటువంటి కార్యకలాపాలు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించినట్లు జనసేన వెల్లడించింది. తుది నిర్ణయాలను తీసుకునేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీవీ రామారావును ఆదేశించింది. ఈ సస్పెన్షన్ వేటు వేయడానికి కారణాలు లేకపోలేదు.
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఇటీవలే ఆందోళన నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ ఆందోళనను జనసేన అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసింది.
2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు టీవీ రామారావు. ఆ తరువాత ఎన్నికలకు దూరం అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2023లో జనసేన పార్టీలో చేరారు. 2024లో కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది. నాటి ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications