జనసేనకు సీట్లు మారటం వెనుక, అక్కడే సీన్ ఛేంజ్ - లాస్ట్ మినిట్ రాజకీయం..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి సీట్ల లెక్క తేలింది. మూడు పార్టీలకు సీట్లు.. స్థానాలు ఫిక్స్ అయ్యాయి. అధికారికంగా ప్రకటించారు. అయితే, జనసేన స్థానాలు ముందు నుంచి ప్రచారం చేసిన సంఖ్య కంటే తగ్గింది. దీని వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేనకు దక్కిన సీట్ల పైన ఆ పార్టీ కేడర్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అనూహ్యం గా బీజేపీకి రెండు కార్పోరేషన్లు కేటాయించారు. అయితే.. అసలు ఈ సీట్ల కేటాయింపులో చివరి నిమిషంలో చోటు చేసుకున్న రాజకీయం ఆసక్తిగా మారింది.

మున్సిపల్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల లెక్క ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు గాను.. జనసేనకు 4, బీజేపీకి 2 కేటాయించారు. మిగతా 11 కార్పొరేషన్లలో టీడీపీ బరిలోకి దిగుతుంది. మొత్తం 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో జనసేనకు 21, బీజేపీకి 7 కేటాయించారు. 78 స్థానాల నుంచి టీడీపీ పోటీ చేయనుంది. అయితే, జనసేన తొలి నుంచి 40 శాతం సీట్లు కోరుతున్నట్లు చెబుతూ వచ్చింది. ఆరు మేయర్ స్థానాలు కోరింది. ఇక దశలో జనసేన కు అయిదు సీట్లు ఇస్తున్నట్లు ప్రచారం సాగింది. బీజేపీకి ఒక్క సీటు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, చివరి జాబితాలో జనసేనకు 4, బీజేపీకి 2 మేయర్ సీట్లు కేటాయించారు. తిరుపతి కోసం మూడు పార్టీల మధ్య చర్చ జరిగింది. దీంతో.. జనసేన ఒంగోలు కోసం పట్టు బట్టింది. విజయవాడ పైన టీడీపీలో ఒత్తిడి ఉన్నా.. ఆ సీటు జనసేనకు కేటాయించారు. అనూహ్యంగా బీజేపీకి రెండు సీట్లు దక్కటం అందునా అనంతపురం కేటాయింపు ఆసక్తి కరంగా మారింది.

 మూలా నక్షత్ర వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కీలక సూచనలు..!!
మూలా నక్షత్ర వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కీలక సూచనలు..!!
jana-sena-seat-sharing-how-much-has-pawan-kalyan-secured-in-ap-local-body-polls

సుదీర్ఘ చర్చలు...తుది కేటాయింపులు

జనసేనకు కేటాయించిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో సగం స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ పార్టీకి కేటాయించిన 4 కార్పొరేషన్లలో రెండు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 10 ఈ జిల్లాల్లో ఉన్నవే. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు స్థానిక సంస్థలను జనసేనకు కేటాయించారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, 3 మున్సిపాలిటీ లు/నగర పంచాయతీలు, రాయలసీమలో మూడు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఇవ్వడం ద్వారా జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లు కనిపిస్తోంది. అయితే.. జనసేనకు మరో మేయర్ సీటు దక్కాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో బీజేపీ ముఖ్య నేతల జోక్యంతో అనంతపురం సీటు ఆ పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఫలితంగా జనసేన నాలుగు మేయర్ స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. జనసేనకు దక్కిన సీట్ల కేటాయింపు పైన ఆ పార్టీ కేడర్.. మద్దతు దారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+