పవన్ కళ్యాన్‌కు మరో నేత గుడ్‌బై: జనసేనకు మాజీ మంత్రి రాజీనామా:వైసీపీ వైపు చూపు..!
జనసేన అధినేతకు ఎన్నికల ఫలితాల తరువాత ఒక్కోక్కరుగా దూరం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ ప్రాధాన్యత ఇచ్చిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు జనసేనకు రాజీనామా చేసారు. ఆయన స్వదస్తూరితో రాసిన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపారు. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుండి జనసేన అభ్యర్దిగా తాజా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రావెల వైసీపీలో చేరటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.
జనసేనకు రావెల రాజీనామా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కొద్ది రోజుల క్రితం వరకూ సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసారు. రైల్వే సర్వీసులకు చెందిన రావెల 2014 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీలో టిక్కెట్ దక్కించుకొని ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతే అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనకు సాంఘిక సంక్షేమ శాఖ అప్పగించారు. మూడేళ్ల తరువాత కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా చంద్రాబు నాడు గుంటూరు జిల్లా నుండి మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబును తప్పించి నక్కా ఆనంద బాబుకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో..అప్పటి నుండి అసంతృప్తిగా ఉన్న రావెల..ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పవన్‌కు దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ ప్రకటించిన తొలి నలుగురిలో రావెల ఒకరు.

జనసేన అభ్యర్దిగా పోటీ..ఓటమి..
రావెల కిషోర్ బాబు 2019 ఎన్నికల్లో తాను గతంలో గెలిచిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుండే జనసేన అభ్యర్దిగా పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో అక్కడ నుండి వైసీపీ అభ్యర్ది సుచరిత గెలుపొందగా..రావెల కిషోర్‌బాబు పరాజయం పాలయ్యారు. దీంతో..ఎన్నికల ఫలితాల నుండి రావెల జనసేన పార్టీ కార్యాలయానికి రాలేదు. పవన్ కళ్యాన్‌తోనూ కలవలేదు. వైసీపీ కేబినెట్ ప్రమాణ స్వీకార సమయంలో తన స్వదస్తూరితో రావెల కిషోర్ బాబు జనసేన అధినేత పవన్‌కు తన రాజీనామా లేఖ రాసారు. తన వ్యక్తిగత కారణాల వలన తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ నేతలతో పాటుగా వైసీపీ నేతలతోనూ టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. తన సొంత జిల్లాకు చెందిన బీజేపీ ప్రముఖుడి ద్వారా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం వైసీపీలో చేరాలని సూచించటంతో ఆయన వైసీపీ నేతలతో టచ్‌లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన జనసేనకు రాజీనామా చేసారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications