చంద్రబాబును జేసీ ఇంతలా పొగిడేశారేంటి..!
ఇంతకాలం జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే పార్టీతో సంబంధం లేకుండా తనకు నచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వ్యక్తి అని అనుకుంటున్న జనం ఇకనుంచి ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టకోవాల్సిందే. జరుగుతున్న పరిణామాల్ని చూసి ఇక తాను కూడా మారాల్సిందే అనుకున్నారో.. ఇంకేమో గానీ మొత్తానికి రెడ్లందరికి తానే ఓ ప్రతినిధిలాగా టీడీపీ అధినేత చంద్రబాబును బాగానే పొగిడేశారు జేసీ.
మొత్తం రెడ్ల తరుపున వకాల్తా పుచ్చుకుని మాట్టాడిన జేసీ.. రెడ్లందరూ చంద్రబాబుతోనే నడుస్తారని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ. పొగడ్తలు కాదని చెప్తూనే కాస్త డోసు పెంచి మరీ చంద్రబాబును జేసీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు కృషి వల్ల రాబోయే రెండేళ్ళలో రాయలసీమ కోనసీమను మించిపోయేలా తయారవుతుందన్నారు. తాను చూసిన సీఎంలు అందరిలోకెల్లా చంద్రబాబే 'ది బెస్ట్' అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు జేసీ.

ఇకపోతే రెడ్ల విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా పేర్ల చివర ఉన్న రెడ్డి తోకలు చూసి అనుమాన పడొద్దని, రెడ్లు ఎప్పుడూ మీ వెంటే ఉంటారని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. రెడ్లందరి తరుపున చంద్రబాబుకి ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన జేసీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేరు చివరన కూడా రెడ్ది ఉందని, దీన్ని చూసైనా రెడ్లంతా చంద్రబాబు వెనకాల నడవడానికి సిద్దంగా ఉన్నారన్న విషయం గమనించాలని చెప్పారు. చివరగా జగన్ గురించి మాట్లాడిన జేసీ, జగన్ వెంట చివరికి మిగిలేది విజయమ్మ ఒక్కరేనని ఎద్దేవా చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications