విష్ణుప్రియతో మ్యారేజ్ పై జేడీ చక్రవర్తి క్లారిటీ
తాను జేడీ చక్రవర్తి (J D Chakravarthy)ని ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి చేసుకుంటానంటూ యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) ఇటీవల వ్యాఖ్యలు చేసింది. వీటిపై తాజాగా జేడీ చక్రవర్తి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి కారణమేంటనే విషయాన్ని వెల్లడించారు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని, కానీ అది ప్రేమ కాదన్నారు.
విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయని, తామిద్దరం కలిసి ఇటీవలే ఒక సిరీస్ లో నటించినట్లు జేడీ తెలిపారు. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని, ఆ సిరీస్ కోసం దాదాపు తామిద్దరం 40 రోజులు కలిసి పనిచేశామన్నారు. షూటింగ్ సమయంలో సిరీస్ దర్శకుడు సాధినేని పవన్ విష్ణుప్రియకు చిన్న సలహా ఇచ్చాడని చెప్పారు. ప్రతిరోజు తాను నటించిన ఒక సినిమాను చూడాలని సలహా ఇచ్చాడన్నారు.

ఆ కారణంగా తాను నటించిన సినిమాలన్నీ విష్ణుప్రియ చూసిందని, ఆ చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడ్డారన్నారు. అంతేకానీ ఆమె తనను ప్రేమించలేదన్నారు. తామిద్దరి మధ్య గురుశికష్యుల అనుబంధమే ఉందని, చాలా తక్కువగా మాట్లాడుకుంటామన్నారు. కొన్నాళ్ల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్ షోలో విష్ణు ప్రియ పాల్గొంది. జేడీ చక్రవర్తి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన్ను ప్రేమిస్తున్నాని చెప్పింది. జేడీ చక్రవర్తి వాళ్ల అమ్మ అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వార్తలు వైరల్ గా మారాయి.
నటుడు జేడీ చక్రవర్తి కొన్నాళ్ల క్రితం వరకు నటనకు దూరంగా ఉన్నారు. ఓటీటీ వేదికలు అందుబాటులోకి రావడం, ముమ్మరంగా సిరీస్ ల నిర్మాణం జరుగుతుండటంతో కొన్ని కీలకమైన పాత్రల కోసం దర్శకులు జేడీని సంప్రదిస్తున్నారు. జేడీ కూడా తిరిగి నటించేందుకు ఆసక్తి చూపుతుండటంతో నెమ్మది నెమ్మదిగా ఆయన బిజీగా మారుతున్నారు. కొన్ని సినిమాల్లో నటించేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications